Telangana Ministries: తెలంగాణ మంత్రులకు శాఖల వివరాలు ఇవే..
- IndiaGlitz, [Saturday,December 09 2023]
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ పెద్దలతో చర్చించిన అనంతరం తాజాగా మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రకటన చేశారు. ఎవరికి ఏ శాఖ కేటాయించారంటే..
మల్లు భట్టి విక్రమార్క- ఆర్థిక శాఖ, ఇంధన శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి- పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ
దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్య శాఖ
కోమటిరెడ్డి వెంటకరెడ్డి- రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ
శ్రీధర్‌బాబు- ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయం, చేనేత శాఖ
పొంగులేటి శ్రీనివాసరెడ్డి- రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్, పర్యాటకం శాఖ
పొన్నం ప్రభాకర్ -బీసీ సంక్షేమం, రవాణా శాఖ
కొండా సురేఖ- అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
సీతక్క- పంచాయతీ రాజ్, స్రీ శిశు సంక్షేమ శాఖ
అయితే కీలకమైన హోంశాఖ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే పెట్టుకోవడం గమనార్హం. అలాగే మరికొన్ని శాఖలు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. త్వరలోనే రెండో విడత మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అప్పుడు ఎంపికయ్యే మంత్రులకు ఆ శాఖలను కేటాయించనున్నారని తెలుస్తోంది.