అఖిల్ లవర్ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్....
Thursday, June 30, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య - సమంత ప్రేమించుకుంటున్నారు...త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ కోలీవుడ్ - టాలీవుడ్ లో వార్తలు షికారు చేస్తుంటే...సడన్ గా నేను...ప్రేమిస్తున్నాను అంటూ అఖిల్ తెర పైకి వచ్చాడు. ఒక విధంగా అఖిల్ లవ్ లో పడ్డాను అంటూ ఓ షాక్ ఇచ్చాడు అని చెప్పవచ్చు. అఖిల్ లవ్ లో పడడం ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ అనుకుంటే...అఖిల్ లవర్ గురించి ఇంకొన్ని ఇంట్రస్టింగ్ డీటైల్స్ బయటకు వస్తున్నాయి. ఇంతకీ ఆ ఇంట్రస్టింగ్ డీటైల్స్ ఏమిటంటే...
అఖిల్ ప్రేమించిన శ్రియా భూఫాల్...కాస్ట్యూమ్ డిజైనర్. ఫిల్మ్ ఫేర్ సౌత్ కి శ్రియా అఫిషియల్ కాస్ట్యూమ్ డిజైనర్. అంతే కాదండోయ్... టాలీవుడ్ లో శ్రియా శరన్, కాజల్ అగర్వాల్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది. అలాగే బాలీవుడ్ బ్యూటీస్ అలియాభట్, శ్రద్దాకపూర్ కి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది. అయితే శ్రియా భూపాల్ అఖిల్ కంటే వయసులో ఒక సంవత్సరం పెద్దదట. ఇంతకీ ఈ శ్రియా భూపాల్ ఎవరో కాదు...హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త జి.వి.కె రెడ్డి మనవరాలు. ఇవి అఖిల్ మనసు దోచుకున్న ప్రియురాలు శ్రియా భూపాల్ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments