సెన్సార్ కార్యక్రమాల్లో 'దేశంలో దొంగలు పడ్డారు'
Send us your feedback to audioarticles@vaarta.com
ఖయూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న చిత్రం "దేశంలో దొంగలు పడ్డారు". ఈ చిత్రాన్ని సారా క్రియేషన్స్ బ్యానర్ పై రమా గౌతమ్ నిర్మిస్తున్నారు. గౌతమ్ రాజ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని సెన్సార్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రానికి శాండీ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రమా గౌతమ్ మాట్లాడుతూ... "తాము చిత్రీకరణ జరిపిన లొకేషన్ లు తమ కథకు, కథనానికి మరింత బలాన్ని చేకూర్చాయి. కెమెరామేన్ శేఖర్ గంగనమోని తన పనితనంతో ఈ చిత్రానికి అదనపు ఆకర్షణను తీసుకోచ్చాడు. రీసెంట్ గా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా విడుదలైన మా మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఒక చిన్న చిత్రానికి ఈ మధ్య కాలంలో ఇంత మంచి స్పందన రావడం అనేది చాలా అరుదు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న మా చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం" అన్నారు.
ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శేఖర్ గంగనమోని , సంగీతం: శాండీ, ఎడిటింగ్: మధు. జి. రెడ్డి, కళ: మధు రెబ్బా, లైన్ ప్రొడ్యూసర్: సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాత: సంతోష్ డొంకాడ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments