చిరంజీవి, చరణ్‌లపై ఫిర్యాదు చేసిన ఉయ్యాలవాడ వారసులు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రామ్‌చరణ్‌లపై ఉయ్యాలవాడ వారసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళ్తే.. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తోన్న చిత్రం `సైరా నరసింహారెడ్డి`. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదలవుతుంది.
అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఉయ్యాలవాడ వారసులను కలిసిన సినిమా యూనిట్ వారి కుటుంబంలో 23 మందికి 50 కోట్లు ఇస్తామని, దానికి ట్యాక్స్ కూడా తామే చెప్పిస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. ఈ విషయం అడగటానికి చిరంజీవి ఇంటికి వెళితే అక్కడ పోలీసులతో అరెస్ట్ చేయించి తప్పుడు కేసులు పెట్టారన్నారు ఉయ్యాలవాడ వారసులు. వారసులమైన తమ నుండి ఉయ్యాలవాడకు సంబంధించిన ఆధారాలు సేకరించి ఇప్పుడు తమపైనే తప్పుడు కేసులు పెట్టారని సదరు వారసులు అంటున్నారు.
ఇప్పటికే ఈ వివాదం పలుసార్లు మీడియా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని రామ్‌చరణ్ దగ్గర ప్రస్తావిస్తే.. ``సుప్రీమ్ కోర్టు తీర్పు ప్రకారం వందేళ్లు దాటిన చరిత్రకారుడి జీవిత చరిత్రను గౌరవప్రదంగా ఎవరైనా సినిమాగా తెరకెక్కించవచ్చు. నరసింహారెడ్డిగారు ఓ ప్రాంతం కోసం పోరాడిన వ్యక్తి. ఆయన ప్రాంతం కోసం నేను ఏదైనా సాయం చేయగలను కానీ.. ఆయన ఓ కుటుంబానికి పరిమితం చేసి, తక్కువ చేయలేను`` అన్నారు రామ్‌చరణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments