బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌తో.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా: మోనాల్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ షో నుంచి గత ఆదివారం ఎలిమినేట్ అయిన హీరోయిన్ మోనాల్ గజ్జర్ తన సినీ, పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. సరైన గైడెన్స్ లేకే తన కెరీర్‌ను ప్లాన్ చేసుకోలేకపోయానని చెప్పిన మోనాల్.. తన బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్‌షిప్ బ్రేకప్ అవడం.. ఈ క్రమంలోనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం తదితర విషయాలను ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తన ఫస్ట్ సినిమా ఒక కాలేజ్ స్టోరీ అని.. కానీ రిలీజ్ అయ్యింది మాత్రం సుడిగాడు అని మోనాల్ వెల్లడించింది. ఆ వెంటనే మళయాలంలో మంచి ఆఫర్ రావడంతో తెలుగులో బ్రేక్ వచ్చిందని తెలిపింది. సరైన గైడెన్స్ లేకపోవడం వల్లే కెరీర్‌ను సరిగా ప్లాన్ చేసుకోలేకపోయానని వెల్లడించింది. ఆ తరువాత తమిళ్ ఆఫర్ వచ్చిందని.. అక్కడకు వెళ్లడంతో.. ఇటు తెలుగు, తమిళ, మళయాళం ఇలా ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్లిపోయానని తెలిపింది. 2012లో సుడిగాడు రిలీజ్ అయ్యింది. ఆ తరువాత 2015 వరకూ బ్రేక్ వచ్చిందని తెలిపింది. ఆ ఏడాది బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ ఆఫర్ వచ్చిందని మోనాల్ వెల్లడించింది.
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమా రిలీజ్ అయిన సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో సెక్సువల్ రిలేషన్ బ్రేకప్ అవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపింది. దీంతో తాను తిరిగి గుజరాత్‌కి షిఫ్ట్ అయ్యానని మోనాల్ వెల్లడించింది. ఆ సమయంలో ఇక మీదట సౌత్ ఇండియాకి రాకూడదని భావించినట్టు తెలిపింది. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ సౌత్ ఇండియాకి చెందినవాడని.. ముఖ్యంగా మలయాళ సినిమా చేస్తున్నప్పుడు తామిద్దరి ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడిందని మోనాల్ చెప్పింది. ఈ ఇన్సిడెంట్‌తో సౌత్ సినిమాలను వదిలేయాలని డిసైడ్ అయ్యానని వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout