'పుష్ప' టీంని చుట్టుముట్టిన డెంగ్యూ.. అల్లు అర్జున్, రష్మిక కూడా ?
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అర్జున్ అభిమానులని చిన్నపాటి కలవరానికి గురిచేసే వార్తే ఇది. కొన్ని రోజుల క్రితం దర్శకుడు సుకుమార్ డెంగ్యూ ఫీవర్ కు గురికావడంతో పుష్ప షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం సుకుమార్ వైద్యుల పర్యవేక్షణలో డెంగ్యూ నుంచి కోలుకుంటున్నారు. సుకుమార్ పూర్తిగా కోలుకోగానే షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది.
ఇదీ చదవండి: అనవసరంగా నన్ను లాగుతున్నారు.. పోర్న్ వీడియోస్ వివాదంపై ప్రముఖ నటి
ఇదిలా ఉండగా ఇన్సైడ్ టాక్ ప్రకారం పుష్ప చిత్ర యూనిట్, నటీనటులలో దాదాపు 20 మంది డెంగ్యూ వ్యాధికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. షూటింగ్ లొకేషన్ లో దోమలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఊహించని షాక్ ఏంటంటే లీడ్ పెయిర్ అల్లు అర్జున్, రష్మిక కూడా డెంగ్యూకి గురయ్యారట.
కానీ బన్నీ, రష్మిక లకు అంత సీరియస్ గా జ్వరం, డెంగ్యూ లక్షణాలు లేవని అంటున్నారు. త్వరగానే వారిద్దరూ కోలుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ఆరోగ్యం కుదుటపడగానే పుష్ప షూటింగ్ రీ స్టార్ట్ అవుతుంది.
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ భీకరమైన రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. పుష్ప చిత్రం రెండు భాగాలుగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments