Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు

  • IndiaGlitz, [Monday,April 29 2024]

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. రిజర్వేషన్ల రద్దు అంశం మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. రేవంత్‌తో పాటు మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోందని ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. అలాగే పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్విట్టర్ హ్యాండిల్స్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ డీప్ ఫేక్ వీడియోను ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. ఝార్ఖండ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఈ వీడియో బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాని మోదీ హెచ్చరించారు.

కాగా ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా.. సిద్దిపేట సభలో మాట్లాడుతూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై కేంద్ర హెంమంత్రిత్వ శాఖ సీరియస్ అయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. బీజేపీ నేతలు, కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో IPC సెక్షన్ 153, 153A, 465, 469, 171G మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 66C కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వీడియోను అప్‌లోడ్ చేసిన వారితో పాటు షేర్ చేసిన ఖాతాల సమాచారాన్ని కోరుతూ ట్విట్టర్‌, ఫేస్‌బుక్ కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేయడం గమనార్హం.

More News

Pensions: ఏపీలో ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో ఎన్నికల వేళ ఎట్టకేలకు పింఛన్ల పంపిణీపై స్పష్టత వచ్చింది. మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దివ్యాంగులు

Dharmana: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అమలు చేయడం లేదు.. మంత్రి ధర్మాన క్లారిటీ..

ఏపీలో ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ చట్టంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ చట్టం ద్వారా రైతుల భూములు, ఆస్తులు లాక్కునేందుకు వైసీపీ నేతలు కుట్రపన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Asaduddin Owaisi:ముస్లింలు ఎక్కువగా కండోమ్‌లు వాడతారు.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

దేశంలో స్వార్వత్రిక ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Gutha Amit:బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన గుత్తా కుమారుడు అమిత్

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే అనేక మంది నేతలు గులాబీ పార్టీకి బై చెప్పగా.

YCP:ఏపీలో మళ్లీ 'ఫ్యాన్' ప్రభంజనమే.. సంచలనంగా మారిన తాజా సర్వే..

ఏపీలో పోలింగ్‌కు మరో 12 రోజులు మాత్రమే సమయం ఉంది.  దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో