సుశాంత్ తండ్రికి నిరాశే.. పిటిషన్ కొట్టేసిన కోర్టు!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ లో స్టార్ గా ఎదుగుతున్న టైంలో యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 14న సుశాంత్ ఉరి వేసుకుని మరణించాడు. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు,వివాదాలు నెలకొన్న తరుణంలో ఆ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా సుశాంత్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో అనేక చిత్రాలు తెరకెక్కుతున్నాయి. దీనితో సుశాంత్ తండ్రి కెకె సింగ్ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించారు. తమ కుమారుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఎలాంటి సినిమాలు తెరకెక్కకుండా చేయాలని, ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రాల విడుదల ఆపేయాలని సింగ్ కోర్టుని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి: ఎద సౌందర్యం కోసం అసభ్యకరమైన పని చేయమన్నారు: హీరోయిన్
తమ కుమారుడి పేరు, అతడి జీవితానికి సంబంధించిన ప్రస్తావన సినిమాల్లో ఉండకూడదని పిటిషన్ లో కోరారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉండడం వల్ల ఇలాంటి చిత్రాలు కేసుని తప్పుదోవ పట్టిస్తాయని సింగ్ అన్నారు. ఈ క్రమంలో త్వరలో విడుదల కాబోతున్న 'న్యాయ్ ది జస్టిస్' అనే చిత్రాన్ని నిలిపివేయాలని కోరారు.
ఇలాంటి చిత్రాలతో తమ కుమారుడి జీవితాన్ని తప్పుదోవ పట్టించడమే కాక, తమకు మానసిక వేదన కలిగించారు. అందుకు రూ 2 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలని అన్నారు. అయితే ఢిల్లీ హై కోర్టులో గురువారం పిటిషన్ విచారణకు వచ్చింది. వాదోపవాదాల తర్వాత కోర్టు సింగ్ పిటిషన్ ని కొట్టివేసింది.
న్యాయ్ చిత్ర విడుదల అడ్డుకోవడం కుదరదని కోర్టు తేల్చింది. న్యాయ్ తో పాటు సూసైడ్ ఆర్ మర్డర్, ఎ స్టార్ వాస్ లాస్ట్ అనే చిత్రాలు సుశాంత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com