మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం
Send us your feedback to audioarticles@vaarta.com
ఛత్తీస్గఢ్ బాటలోనే ఢిల్లీ ప్రభుత్వం కూడా నడుస్తోంది. సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా.. ఆన్లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా మద్యం ఆర్డర్ ఇచ్చినవారికి హోం డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఢిల్లీ ఆబ్కారీ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఎల్-13 లైసెన్సు ఉన్న షాపులు మద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు అనుమతినిస్తున్నట్టు ఆబ్కారీ శాఖ పేర్కొంది.
భారతీయ కంపెనీలకు చెందిన మద్యాన్నే కాదు.. విదేశాలకు చెందిన మద్యాన్ని సైతం ఇంటికి డెలివరీ చేసుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వల్ల లాక్డౌన్ కారణంగా ఆంక్షల అమల్లో భాగంగా ఎక్సైజ్ చట్టాలను సైతం సవరించారు. ఈ క్రమంలోనే మందుబాబులు దర్జాగా ఇంట్లో కూర్చొనే మద్యాన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ ఆర్డర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా జరగాల్సిందే. అయితే హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు మాత్రం మద్యం హోండెలివరీ సౌకర్యం లేదు. అలాగే ఎల్-13 లైసెన్సు లేని వారు మద్యం హోం డెలివరీ చేయడానికి అవకాశం లేదు.
ఇటీవలే చత్తీస్గఢ్ ప్రభుత్వం సైతం మద్యాన్ని మద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు అనుమతిచ్చింది. అయితే ఇక్కడ హోం డెలివరీ చసేందుకు కారణం మరొకటి ఉంది. అక్రమంగా మద్యం తయారీని అడ్డుకోవడంతో కల్తీ మద్యం, శానిటైజర్లు తాగి ప్రజలు చనిపోతుండటం వల్ల నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసి డబ్బులు చెల్లిస్తే.. సమీపంలోని షాపు నుంచి మద్యం హోం డెలివరీ చేస్తామని కొద్ది రోజుల క్రితమే చత్తీస్గఢ్ రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీఎస్ఎంసీఎల్) ప్రకటించింది. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్లో నిర్విఘ్నంగా మద్యం హోం డెలివరీ జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments