దేశంలో హడలెత్తిస్తోన్న కోవిడ్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి పాజిటివ్

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మళ్లీ ఒక్కొక్క రాష్ట్రం ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. అటు పలువురు ప్రముఖులు సైతం కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విక్రం, వడివేలు, కరీనా కపూర్, అమృతా అరోరా, మంచు మనోజ్, సౌరవ్ గంగూలి సహా పలువురు రాజకీయ నేతలకు సైతం వైరస్ సోకింది. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేరారు. కోవిడ్‌ పరీక్షల్లో తనకు పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన స్వయంగా చెప్పారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. హోం ఐసోలేషన్‌‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు తమ కుటుంబంలో ఒకరికి, తన సిబ్బందిలో మరొకరికి పాజిటివ్‌గా తేలడంతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. తాను పరీక్షలు చేయించుకోగా కరోనా నెగెటివ్‌ వచ్చిందన్నారు. అయితే వైద్యుల సలహా మేరకు ఇంటిలోనే ఉంటానని, కొద్దిరోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయించుకుంటానని ప్రియాంక వెల్లడించారు.

ఢిల్లీలో గత వారం రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో… నగరంలో కరోనా ఆంక్షలు అమలు అవుతున్నాయి. థియేటర్లు, పార్కులు, బార్లు, పార్టీ మీటింగ్స్‌‌పై ఆంక్షలు ఉన్నాయి. అయితే కొత్త నిబంధనల కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు బస్టాప్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు కిలోమీటర్ల మేర బారులు తీరి కన్పించారు. ఒక సర్వీసుకు సగం మందితో మాత్రమే బస్సులను, మెట్రోలను నడిపేందుకు అనుమతి ఉండటంతో బస్టాప్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద అయితే ఈ క్యూలైన్‌ దాదాపు 2 కిలోమీటర్లకు పైనే ఉండటం గమనార్హం.

More News

చిరంజీవి కోసమే ఐటెం సాంగ్‌.. ఇక జీవితంలో మళ్లీ చేయను : రెజీనా

రెజీనా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె స్టార్‌ హీరోయిన్‌ కావడం ఖాయమని సినీ జనాలు, ప్రేక్షకులు భావించారు.

అలా జరిగితేనే లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ : తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారతదేశంలోనూ విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్క రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు అమలవుతున్నాయి.

ఆచార్య నుంచి ‘‘ శానా కష్టం వచ్చిందే మందాకినీ’’.. ఫుల్ సాంగ్ , రెజీనాతో చిరు మాస్ స్టెప్పులు

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ సినిమాను ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

హీరోయిన్‌తో విక్రమ్ తనయుడు ప్రేమాయణం.. దుబాయ్‌లో చక్కర్లు, ఫోటోలు వైరల్

సినీ పరిశ్రమకు , రూమర్లకు అవినాభావ సంబంధం వుంటుంది.

ఏపీలోనూ పార్టీ.. అక్కడ నేను పెట్టకూడదని రూల్ లేదుగా: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్‌టీపీ కార్యాలయంలో