తెలంగాణకు విరాళం ప్రకటించిన ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ సీఎంలు..
Send us your feedback to audioarticles@vaarta.com
భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా దెబ్బతిన్న హైదరాబాద్‌ను ఆదుకునేందుకు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం సైతం తెలంగాణకు సాయమందించేందుకు ముందుకు వచ్చింది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్‌లో సహాయ చర్యల నిమిత్తం రూ.15 కోట్ల విరాళాన్ని అందిస్తామని ప్రకటించారు.
హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయని.. ఈ సంక్షోభ సమయంలో హైదరాబాద్ వాసులకు ఢిల్లీ ప్రజలు అండగా ఉంటారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల్లో భాగంగా డిల్లీ ప్రభుత్వం తరుఫున 15 కోట్ల రూపాయల విరాళాన్ని అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కాగా.. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టాలీవుడ్ సినీ పరిశ్రమ భారీగా విరాళాలను ప్రకటిస్తోంది.
మమత రూ. 2 కోట్లు..
కాగా.. తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్ తరపున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ సైతం రూ. 2 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం మమత బెనర్జీ లేఖ రాశారు. తెలంగాణ ప్రజానీకానికి పశ్చిమ బెంగాల్ అండగా ఉంటుందని ఆమె భరోసానిచ్చారు. కొన్ని నెలల క్రితం తమ రాష్ట్రం కూడా ‘అంఫాన్’ తుఫాను వల్ల ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొందని మమత వెల్లడించారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని మమత బెనర్జీ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout