సంచలనం సృష్టించిన నోవాటెల్ ఘటనలో నిందితుడి అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
విజయవాడ నోవాటెల్ హోటల్ దగ్గర జరిగిన దారుణం జరిగింది. కారులో ముగ్గురు ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారు. నగరం నడిబొడ్డున సోమవారం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. ఈ హత్యాయత్నానికి ప్రధాన కారణం డబ్బు వ్యవహరమేనని పోలీసులు గుర్తించారు.
అసలు విషయంలోకి వెళితే.. ఏడాది క్రితం వేణుగోపాల్‌రెడ్డి అనే వ్యక్తి నాగమణి, గంగాధర్ దంపతులు, కృష్ణారెడ్డి అనే వ్యక్తికి 2 కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చాడు. తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా వీరంతా కాలం వెళ్లబుచ్చుతున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వేణుగోపాల్‌రెడ్డి.. ఫైనాన్స్ వ్యవహారం సెటిల్ చేసుకుందాం రమ్మని పిలిచాడు. దీంతో గంగాధర్ దంపతులతో పాటు కృష్ణారెడ్డి ఓ కారులో నోవాటెల్ దగ్గరకు వచ్చారు. ఈ నేపథ్యంలో వేణుగోపాల్‌రెడ్డి.. మిగిలిన ముగ్గురికీ మధ్య వివాదం నెలకొంది. దీంతో ఆగ్రహించిన వేణుగోపాల్‌రెడ్డి.. పథకం ప్రకారం ముందే తెచ్చుకున్న పెట్రోల్‌ను కారులో ఉన్న గంగాధర్ దంపతులతోపాటు కృష్ణారెడ్డి పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు.
కృష్ణారెడ్డి ఎలాగోలా కారు నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు కానీ తీవ్రంగా గాయపడ్డాడు. వెనుక సీట్లో ఉండటంతో గంగాధర్ దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హత్యాయత్నం కింద కేసు నమోదు పోలీసులు విచారణ ప్రారంభించారు. నేడు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు వేణుగోపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన కృష్ణారెడ్డి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. దీంతో అతడిని మెరుగైన చికిత్స నిమిత్రం విజయవాడ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout