సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడిస్తా.. బీజేపీ ఎంపీ శపథం
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రమంత్రి కేటీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పన్నుల రూపంలో వచ్చిన డబ్బునే తిరిగి హైదరాబాద్ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం రూపంలో అందిస్తోందని.. అంతేకానీ కేటీఆర్ జేబులో నుంచి డబ్బేమీ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన 224 కోట్ల విపత్తు నిధుల నుంచే మీరు 10వేలు పంచుతున్నారన్నారు. ప్రజల డబ్బుతోనే సీఎం కేసీఆర్ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ జీతాలు లభిస్తున్నాయని అర్వింద్ పేర్కొన్నారు. ప్రజల డబ్బునే ఇస్తూ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కేటీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తను విమర్శించే హక్కు లేదంటూ ఫైర్ అయ్యారు. కార్యకర్త ఇల్లు మునిగిందని, ఆఫీసర్లు ఇస్తే తీసుకున్నాడని, రానివారి కోసం పోరాటం చేస్తే తప్పేంటన్నారు.
అబద్దాలు చెప్పడంలో కేటీఆర్ తన తండ్రిని మించిపోయాడన్నారు. ఆయనకు మంత్రి పదవి తన తండ్రిపెట్టిన భిక్ష అన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తే తండ్రిని తిట్టిన వ్యక్తి కేటీఆర్ అని అర్వింద్ పేర్కొన్నారు. అలాంటి కేటీఆర్‌కు బీజేపీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అభిషేక్ అనే బీజేపీ కార్యకర్త ఇల్లు మునిగిందని.. అధికారులు ఇచ్చే సహాయం తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. సహాయం అందని వారి కోసం మళ్లీ ఆందోళన చేస్తే తప్పెలా అవుతుందని అర్వింద్ ప్రశ్నించారు. అలాంటి కార్యకర్త ఉన్నందుకు గర్వపడుతున్నామన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ వాళ్లను ఏడు చెరువుల నీళ్లు తాగించామన్నారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో కేటీఆర్ ఓడించడం ఖాయమని అర్వింద్ తెలిపారు.
2005లో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నాలాలపై 2లక్షల అక్రమ నిర్మాణాలను తొలగించారని.. కానీ ఓల్డ్ సిటీలో ఒక్క పాన్ డబ్బా తీయాలన్నా కేటీఆర్‌కు వణుకుతున్నారని అర్వింద్ ఎద్దేవా చేశారు. ఓవైసీకి చెంచాగిరి చేయడమే పాలన కాదన్నారు. ఫామ్ హౌస్‌లో పడుకునే కేసీఆర్ 4 లక్షల పదివేల జీతం తీసుకుంటున్నారని అర్వింద్ విమర్శించారు. నలుగురు ఎంపీలం ఏమి తేలేదంటే ఊరుకోబోమన్నారు. కేంద్రం ఎంత ఇచ్చిందో చర్చకు సిద్ధమని.. సీఎం సహా ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్ధమా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే పెద్ద విపత్తు అని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకుండా డబుల్ డెక్కర్ బస్ అంటూ తమాషా చేస్తున్నారని అర్వింద్ మండిపడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com