డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా 'ధీవర' ఫస్ట్ లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో వైవిధ్యమైన సినిమాల హవా పెరుగుతోంది. కొత్తగా వస్తోన్న దర్శకులే కాదు.. నిర్మాతలు కూడా ఈ తరహా కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో మరో డిఫరెంట్ మూవీ రాబోతోంది. సినిమా పేరు ధీవర. నాగసాయి, విదా చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. టైటిల్ కు తగ్గట్టుగానే డైనమిక్ స్క్రిప్ట్ తో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ " ధీవర కాన్సెప్ట్ బాగుంది. యూత్ రిలేట్ అయ్యే విధంగా కథ ఉంది. ఆ పోస్టర్ తనకు బాగా నచ్చిందని.. ఎంటైర్ యూనిట్ కు ఆల్ ద బెస్ట్ " చెప్పారు.
దర్శకుడు విజయ్ జిక్కి మాట్లాడుతూ.. "ధీవర సినిమాలో స్క్రీన్ ప్లే హైలెట్ గా ఉంటుందని.. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమా ఒకేసారి రెండు జానర్స్ లో సాగుతుందని "
అన్నారు.
నిర్మాత హరనాథ్ బాబు మాట్లాడుతూ .. " కమర్సియల్ అంశాలకు కూడా పెద్ద పీట వేసినట్టు చెప్పాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. త్వరలోనే ఆడియోతో పాటు ట్రైలర్ ను విడుదల చేస్తామని చెబుతున్నారు అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని వచ్చే నెలాఖరు వరకూ ప్రేక్షకుల ముందుకు తెస్తామని " అన్నారు.
భరీరథ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : క్రాంతి(ఆర్.కె), పోస్ట్ ప్రొడక్షన్ : డిజే స్టూడియో, డ్యాన్స్ : జావీద్ ఖాన్, సంగీతం : అద్దంకి వెంకటేష్, సినిమాటోగ్రఫీ : సాగర్ గొళ్లా, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, నిర్మాత : హరనాథ బాబు, దర్శకత్వం : కె. విజయ్ జిక్కి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com