Deepti Sunaina : చీరకట్టులో, స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో దీప్తి సునైన ... లేలేత పరువాలతో చెక్కిలిగింతలు

  • IndiaGlitz, [Tuesday,December 06 2022]

టిక్‌టాక్, డబ్ స్మాష్, యూట్యూబ్ స్టార్‌గా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ పాపులారిటీతో బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది దీప్తి సునైన. సోషల్ మీడియాలో తనకున్న బేస్‌తోనే అవకాశాలు సృష్టించుకుంటోంది ఈ హైదరాబాద్ అమ్మాయి. నగరంలోని స్టెవెన్స్ అన్నాస్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన దీప్తి.. ఆ తర్వాత క్రియేటివ్ ఫీల్డ్‌కి ఎంట్రీ ఇచ్చారు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

షణ్ముఖ్‌తో బ్రేకప్ అయ్యాక జోరు :

ఈ క్రమంలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జత్వంత్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కుతారు అనుకుంటున్న సమయంలో ఇద్దరూ బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరి దారులు వారివయ్యాయి. ఇద్దరూ కెరీర్‌లో దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్:

వైట్ స్కిన్ టోన్‌తోనే, మంచి ఫిగర్‌తో చూడగానే ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం. అందుకే చీరకట్టుతో పాటు లేటెస్ట్ ట్రెండీ వేర్‌తో హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ రచ్చ చేస్తూ వుంటోంది. అందాల ఆరబోతతో పాటు మంచి డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ నిత్యం యూత్‌తో టచ్‌లో వుంటోంది దీప్తి సునైన. అలా ఫేస్‌బుక్, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటోంది.

జీరో ఫ్యాట్‌ ఫిట్‌నెస్‌తో స్టన్నింగ్ బ్యూటీ:

లేటెస్ట్‌గా దీప్తి సునైన చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. సిల్క్ చీరలో , స్లివ్‌లెస్ జాకెట్‌తో హాట్ లుక్‌తో వున్న ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఒర కంటితో చూస్తూ అందాల విందుతో స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జీరో ఫ్యాట్ ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తున్న ఈ అమ్మడు... ఈ ఫోటోల్లో హాట్‌నెస్‌గా కేరాఫ్‌గా నిలిచింది.