Deepti Sunaina : షణ్ముఖ్‌తో బ్రేకప్.. ఫస్ట్ టైమ్ స్పందించిన దీప్తి సునైన, కాబోయే వ్యక్తి ఇలా వుండాలట
Send us your feedback to audioarticles@vaarta.com
టిక్‌టాక్, డబ్ స్మాష్, యూట్యూబ్ స్టార్‌గా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ పాపులారిటీతో బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది దీప్తి సునైన. సోషల్ మీడియాలో తనకున్న బేస్‌తోనే అవకాశాలు సృష్టించుకుంటోంది ఈ హైదరాబాద్ అమ్మాయి. నగరంలోని స్టెవెన్స్ అన్నాస్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన దీప్తి.. ఆ తర్వాత క్రియేటివ్ ఫీల్డ్కి ఎంట్రీ ఇచ్చారు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్:
వైట్ స్కిన్ టోన్‌తోనే, మంచి ఫిగర్‌తో చూడగానే ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం. అందుకే చీరకట్టుతో పాటు లేటెస్ట్ ట్రెండీ వేర్‌తో హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ రచ్చ చేస్తూ వుంటోంది. అందాల ఆరబోతతో పాటు మంచి డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ నిత్యం యూత్‌తో టచ్‌లో వుంటోంది దీప్తి సునైన. అలా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటోంది.
షణ్ముఖ్‌తో బ్రేకప్ అయ్యాక జోరు :
ఈ క్రమంలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జత్వంత్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కుతారు అనుకుంటున్న సమయంలో ఇద్దరూ బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరి దారులు వారివయ్యాయి. ఇద్దరూ కెరీర్లో దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరూ విడివిడిగా సొంతిళ్లు కట్టుకున్నప్పటికీ.. ఒకరి నుంచి ఒకరికి ఆహ్వానం అందలేదు. అయితే బ్రేకప్ అయిన తర్వాత దీప్తి కానీ, షన్నూ కానీ ఈ వ్యవహారంపై స్పందించలేదు.
నా జీవితంలో ఇలాంటి వ్యక్తి కావాలన్న దీప్తి :
బిగ్‌బాస్ షోని పూర్తి చేసుకుని బయటకు వచ్చాక అనూహ్యంగా ఇద్దరికీ బ్రేకప్ జరిగింది. అయితే దీనిపై కొందరు సన్నిహితులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం దక్కలేదు. కానీ ఇద్దరి మధ్యా ఎందుకు చెడిందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఎవరో ఒకరు నోరు విప్పనిదే దీనిపై రకరకాల కథనాలు వస్తూనే వుంటాయి. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత దీప్తి సునైన స్పందించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండే దీప్తి సునైన.. ఇటీవల అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఈ నేపథ్యంలో షణ్ముఖ్‌తో బ్రేకప్ విషయం చర్చకు వచ్చింది. ఓ నెటిజన్ ఆమెని దీనిపై ప్రశ్నించాడు. బ్రేకప్ తర్వాత మీ జీవితం ఎలా వుందని అడగ్గా.. దీనికి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రోజు రోజుకీ రోబోలో రియాక్ట్ అవుతున్నానని వ్యాఖ్యానించింది. ఇక ఎలాంటి వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారనే ప్రశ్నకు దీప్తి స్పందిస్తూ.. అతనిలో మంచి హ్యూమర్ వుండాలని, తనను నవ్విస్తే చాలని చెప్పింది. కానీ నెటిజన్లు మాత్రం వీరిద్దరూ మళ్లీ కావాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout