వివాదంలో దీప్ వీర్ వివాహం
- IndiaGlitz, [Tuesday,November 20 2018]
బాలీవుడ్ తారలు రణవీర్ సింగ్, దీపికా పదుకొనె ఈ నెల 14,15 తేదీల్లో ఇటలీ లేక్ కోమోలో జరిగిన వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కొంకణి సంప్రదాయం..సింధీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. వీరు ఇండియా కూడా వచ్చేశారు.
అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో వీరి వివాహంపై ఓ వివాదం రేగింది. అదేంటంటే వివాహం తర్వాత నిర్వహించే అనంద్ కరాజ్ అనే కార్యక్రమం సంప్రదాయ పద్దతిలో జరగలేదని ఇటాలియన్ సిక్ ఆర్గనైజేషన్ పేర్కొంది. సిక్కులు పాటించాల్సిన నిబంధనను అనంద్ కరాజ్ కార్యక్రమంలో పాటించలేదనేది వీరి వాదన.
సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌ను గురు ద్వారాలోనే తీసుకోవాలి. కానీ ఆ నియమాన్ని ఈ పెళ్లిలో అతిక్రమించారని సంఘం పేర్కొంది. విషయాన్ని అఖల్ తక్త్ జతేదార్ వద్దకు తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. ఆ పిర్యాదు మరో ఐదుగురు మత గురువులు వద్దకు తీసుకెళ్లినట్లు అఖల్ తక్త్ జతేదార్ తెలిపారు.