దీపిక స్టింగ్ ఆపరేషన్.. ఉలిక్కిపడ్డ అధికారులు!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టింగ్ ఆపరేషన్స్.. ఈ పేరు వింటే రాజకీయ నాయకులు ఉలిక్కిపడతారు. వీటిని పాత్రికేయలోకం ఎక్కువగా నిర్వహిస్తుంటుంది. సమాజంలో అవినీతిని వెలికి తీయడానికి.. ఈ ఆపరేషన్లు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొనే.. ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్ ఒకటి నిర్వహించింది. ఆమె నటించిన ఛపాక్ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో .. ఆమె నటన పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. దీపిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్.. ఇండస్ట్రీలోనే కాదు.. పోలీస్ శాఖలోనూ హాట్ టాపిక్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. యాసిడ్ అమ్మకాలపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. యాసిడ్ కొనాలంటే.. గుర్తింపు కార్డు కచ్చితంగా చూపాలి. షాపు యజమానికి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే దీపిక స్టింగ్ ఆపరేషన్‌లో యజమానుల ఉదాసీనత బయటపడింది. ఎలాంటి గుర్తింపు పత్రాలు చూపకుండానే.. దీపిక అండ్ టీమ్ 24 యాసిడ్ బాటిల్స్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని దీపిక తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా బయటపెట్టింది. వీడియోను కూడా పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయ్యింది. దీపిక సీక్రెట్ ఆపరేషన్‌ను పలువురు అభినందిస్తున్నారు. మరోవైపు పోలీస్ శాఖ కూడా దీనిపై దృష్టి పెట్టినట్టు సమాచారం. యాసిడ్ అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించమని సంబంధింత అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout