ప్ర‌భాస్ 21లో దీపికా ప‌దుకొనె రోల్ ఏంటంటే..?

  • IndiaGlitz, [Tuesday,July 21 2020]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనె పాత్ర ఏంట‌నే దానిపై ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేంటంటే దీపికా ప‌దుకొనే ప్ర‌భాస్ 21వ చిత్రంలో డాన్స‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. ఆ పాత్ర చేసే డాన్స్ మూమెంట్స్ గొప్ప‌గా ఉంటుంద‌ట‌. ఇలాంటి పాత్ర‌లో ఒదిగిపోవాలంటే మంచి డాన్స‌ర్ అయ్యుండాల‌ని ఆలోచించిన నాగ్ అశ్విన్ దీపికా ప‌దుకొనెను హీరోయిన్‌గా తీసుకున్నార‌ట‌.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌ త‌న 20 సినిమా ‘రాధేశ్యామ్’ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. అంతా స‌జావుగానే సాగుతున్న‌స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ప్ర‌భాస్ ‘రాధేశ్యామ్’సినిమా షూటింగ్ ఆగింది. దీన్ని పూర్తి చేసిన తర్వాతే వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌లో ప్ర‌భాస్ పాల్గొంటారు.

More News

రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ వారి 'Bకామ్ లో ఫిజిక్స్'

ఏడుచేప‌ల క‌థ ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య ద‌ర్శ‌కత్వం లో వ‌స్తున్న మ‌రో చిత్రానికి Bకామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ ని ఖ‌రారు చేశాడు.

తొలిసారి ర‌కుల్ ప్ర‌య‌త్నం.. వ‌ర్క‌వుట్ అయ్యేనా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా మెప్పించి గుర్తింపు సంపాదించుకుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

మ‌ణిర‌త్నం బాట‌లో సుకుమార్‌..?

తెలుగు చిత్ర‌సీమ‌లో నేటిత‌రం బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో సుకుమార్ ఒక‌రు. ‘రంగ‌స్థ‌లం’ త‌ర్వాత  అల్లు అర్జున్‌తో ‘పుష్ప‌’ అనే ప్యాన్ ఇండియా మూవీ

రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై కీలక వార్త వెలుగులోకి..

కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని దేశాలూ పోటాపోటీగా కృషి చేస్తున్నాయి.

ఎండ తగలకుండా ఇంటికే పరిమితమయ్యారా?.. అదీ డేంజరేనట..

విటమిన్ డి లోపం ఉన్న వారికి కూడా కరోనా సోకే అవకాశాలు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే.