Deepika Padukone: దీపికా పదుకొనే పుట్టినరోజు సందర్భంగా 'ప్రాజెక్ట్ – కె' పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీగా రూపుదిద్దుకుంటుంది. దీపికా పదుకొణె ( Deepika Padukone) కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పుట్టినరోజుల సందర్భంగా ప్రీ-లుక్ పోస్టర్ లను ఇదివరకే విడుదల చేశారు మేకర్స్. తాజాగా దీపికా పదుకొణె (Deepika)పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టీమ్ చిత్రంలోని ఆమె ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. సిల్హౌట్ ఇమేజ్ దీపిక ఒక కొండపై నిలబడి వున్నట్లుగా చూడవచ్చు. సూర్యకిరణాలు ఆమె శరీరంపై పడటం గమనించవచ్చు. పోస్టర్‌పై “ఎ హోప్ ఇన్ ది డార్క్” అనే ట్యాగ్‌లైన్ పాత్ర యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
ప్రాజెక్ట్ - కె భారతీయ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం. దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Aswin) స్క్రిప్ట్ , ఇతర ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇటివలే చక్రం తయారీని చూపించిన BTS వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర బృందం సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి ఎంత కృషి చేస్తోందో ఈ వీడియో తెలియజేస్తోంది.
విజయవంతంగా 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకుంటున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అశ్విని దత్ నిర్మాణంలో ఈ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com