దీపికా మంగ‌ళ‌సూత్రం ఖ‌రీదెంతో తెలుసా..

  • IndiaGlitz, [Monday,November 05 2018]

బాలీవుడ్ తార‌లు ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనె ఈ నెల 14, 15న ఇట‌లీలో జ‌ర‌గ‌బోయే పెళ్లితో ఒక్క‌టి కానున్నారు. పెళ్లి ప‌న‌లు చ‌క చ‌కా జ‌రిగిపోతున్నాయి. పెళ్లి రోజు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో దీపికా త‌న‌కు ఇష్ట‌మైన న‌గ‌ల‌ను కొన‌డానికి అందేరిలోని ఓ జ్యూయెల్ షాప్‌కి వెళ్లింది.

ఈ విష‌యం ముందుగా స‌ద‌రు షాప్ వారికి చెప్పారు. వారు దీపిక‌కు ఎటువంటి ఇబ్బంది ఉండ‌కూడ‌ద‌ని భావించి ష‌ట్ట‌ర్ క్లోజ్ చేసి క‌స్ట‌మ‌ర్స్‌ను బ‌య‌ట‌కు పంపేశారు. దీపికా గంట పాటు షాపింగ్ చేసుకున్నారు. ఇర‌వై ల‌క్ష‌ల రూపాయలు పెట్టి మంగ‌ళ‌సూత్రం కొన్నార‌ట‌. మొత్తం కోటి రూపాయ‌ల అభ‌ర‌ణాల‌ను కోనుగోలు చేశార‌ని స‌మాచారం.