దీపిక ఇంటరాగేషన్ లీక్.. స్కెచ్ అదిరిపోయిందిగా..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్‌ను డ్రగ్ కేసు వణికిస్తోంది. ప్రస్తుతం ఎన్సీబీ స్టార్ హీరోయిన్లను వరుసగా విచారిస్తోంది. నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను విచారించింది. ఇంకా దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ వరుసలో ఉన్నారు. అయితే దీపికను డ్రగ్ కేసులో ఎన్సీబీ విచారిస్తున్న వీడియో అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లింక్ క్లిక్ చేసి చూసిన వారు షాక్ అవుతున్నారు. ఏం స్కెచ్ గీశార్రా బాబు అనుకుంటున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. రైతు సమస్యలు ప్రజానీకానికి ఏమాత్రం పట్టదు. సోషల్ మీడియాలో రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు.. ఇంత ఇబ్బంది పడుతున్నారు కానీ మీడియాకు అవేం పట్టవంటూ సదరు ప్రజానీకం విమర్శలు తీవ్ర స్థాయిలో గుప్పిస్తోంది. పోనీ రైతు సమస్యలకు సంబంధించిన ఏ వార్త వైపు కూడా చూడరు సరికదా.. నెట్‌లో కనిపించినా దానిని క్లిక్ చేయాలని కూడా అనుకోరు. దీంతో రైతు సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనుకున్న కొందరు అదిరిపోయే స్కెచ్ వేశారు. దీపికను ఎన్సీబీ విచారిస్తున్న ఫుటేజ్ లీక్ అయిందని చెప్పి నెట్టింట్లో పోస్ట్ చేశారు. దీపికను ఎన్సీబీ విచారిస్తోందంటే ఇక ఆగుతారా.. చూడగానే క్లిక్ చేశారు.
క్లిక్ చేయగానే.. ‘‘ఈ ఆర్టికల్‌ను క్లిక్ చేసినందుకు థాంక్యూ. ఈ ఆర్టికల్ తాజాగా నడుస్తున్న బిగ్గెస్ట్ న్యూస్ గురించి. అయితే ఇది దీపిక గురించి అయితే కాదు. పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన వివాదాస్పద మూడు వ్యవసాయ బిల్లులపై రైతులు చేస్తున్న పోరాటానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఈ పోరాటాలు నార్త్ ఇండియా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రస్తుత ఈ పోరాటాలపై మనం దృష్టి పెట్టడం అత్యవసరం’’ అని పోస్ట్ పెట్టారు. దీనికి తోడు.. వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను వీడియోలతో సహా పోస్ట్ చేశారు. మొత్తానికి దేశ ప్రజానీకం దృష్టికి తీసుకెళ్లడంలో సఫలమయ్యారనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com