దీపిక ఇంటరాగేషన్ లీక్.. స్కెచ్ అదిరిపోయిందిగా..

  • IndiaGlitz, [Saturday,September 26 2020]

బాలీవుడ్‌ను డ్రగ్ కేసు వణికిస్తోంది. ప్రస్తుతం ఎన్సీబీ స్టార్ హీరోయిన్లను వరుసగా విచారిస్తోంది. నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను విచారించింది. ఇంకా దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ వరుసలో ఉన్నారు. అయితే దీపికను డ్రగ్ కేసులో ఎన్సీబీ విచారిస్తున్న వీడియో అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లింక్ క్లిక్ చేసి చూసిన వారు షాక్ అవుతున్నారు. ఏం స్కెచ్ గీశార్రా బాబు అనుకుంటున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. రైతు సమస్యలు ప్రజానీకానికి ఏమాత్రం పట్టదు. సోషల్ మీడియాలో రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు.. ఇంత ఇబ్బంది పడుతున్నారు కానీ మీడియాకు అవేం పట్టవంటూ సదరు ప్రజానీకం విమర్శలు తీవ్ర స్థాయిలో గుప్పిస్తోంది. పోనీ రైతు సమస్యలకు సంబంధించిన ఏ వార్త వైపు కూడా చూడరు సరికదా.. నెట్‌లో కనిపించినా దానిని క్లిక్ చేయాలని కూడా అనుకోరు. దీంతో రైతు సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనుకున్న కొందరు అదిరిపోయే స్కెచ్ వేశారు. దీపికను ఎన్సీబీ విచారిస్తున్న ఫుటేజ్ లీక్ అయిందని చెప్పి నెట్టింట్లో పోస్ట్ చేశారు. దీపికను ఎన్సీబీ విచారిస్తోందంటే ఇక ఆగుతారా.. చూడగానే క్లిక్ చేశారు.

క్లిక్ చేయగానే.. ‘‘ఈ ఆర్టికల్‌ను క్లిక్ చేసినందుకు థాంక్యూ. ఈ ఆర్టికల్ తాజాగా నడుస్తున్న బిగ్గెస్ట్ న్యూస్ గురించి. అయితే ఇది దీపిక గురించి అయితే కాదు. పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన వివాదాస్పద మూడు వ్యవసాయ బిల్లులపై రైతులు చేస్తున్న పోరాటానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఈ పోరాటాలు నార్త్ ఇండియా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రస్తుత ఈ పోరాటాలపై మనం దృష్టి పెట్టడం అత్యవసరం’’ అని పోస్ట్ పెట్టారు. దీనికి తోడు.. వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను వీడియోలతో సహా పోస్ట్ చేశారు. మొత్తానికి దేశ ప్రజానీకం దృష్టికి తీసుకెళ్లడంలో సఫలమయ్యారనే చెప్పాలి.

More News

మోనాల్‌కి మంచి కాంపిటీషన్‌గా స్వాతి దీక్షిత్ ఎంట్రీ..

ఇవాళ షోలో ఏమీ లేదనిపించినా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది.

గాన గంధర్వుడి చివరి పాట ఇదే...

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సినీ కెరీర్.. 1966లో పద్మనాభం నిర్మించిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో ప్రారంభమైంది.

బాలుపై వచ్చిన ఆ ఆర్టికల్ తెగ వైరల్ అవుతోంది..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సినీ కెరీర్.. 1966లో పద్మనాభం నిర్మించిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో ప్రారంభమైంది.

రేపు సాయంత్రం తామరైపాకంలో బాలు అంత్యక్రియలు..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు.

బాలు, నేనూ శ్రీకాళహస్తిలో చదివాం.. రూ.100 తీసుకున్నా: మోహన్‌బాబు

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నేడు పరమపదించిన విషయం తెలిసిందే.