ప్రభాస్ సినిమాకి దీపిక ఇంతవరకూ అడ్వాన్స్ తీసుకోలేదట..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ ప్రభాస్ హీరోగా ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పదుకునే సైతం ఫిక్స్ అయిపోయింది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం ఇప్పటికే వెలువడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. దీపిక ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ కూడా తీసుకోలేదట...
ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన సమయంలో దీపిక నెటిజన్లపై విరుచుకు పడింది. ఈ సినిమాను ప్రభాస్ 21గా పేర్కొనడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభాస్ తన 21వ చిత్రంలో చేస్తున్నాడని.. అంతేకానీ ఈ మూవీ పేరు ప్రభాస్ 21 కాదంటూ ట్వీట్ చేసింది. దీంతో షాకైన నెటిజన్లు కొందరు.. సినిమా పేరు ఫిక్స్ చేయనంత వరకూ సదరు హీరో చేస్తున్న సినిమా నంబర్‌తోనే చెప్తారని.. దానికంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీపిక అడ్వాన్స్ తీసుకోకపోవడానికి ఈ ఘటనకు ఏదైనా సంబంధం ఉందేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అసలు కారణం వేరే ఉందని టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో అడ్వాన్స్ తీసుకోవడం మంచిది కాదని దీపిక భావించిందట. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై.. మార్కెటింగ్ స్టార్ట్ అయిన అనంతరం మాత్రమే రెమ్యునరేషన్ తీసుకోవాలని భావిస్తోందని సమాచారం. ఇదే విషయాన్ని ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్‌కు కూడా చెప్పారని టాక్. దీంతో ఆయన కూడా సంతోషం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments