ప్రభాస్ 21.. దీపిక కండీషన్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20 సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో తన 21వ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అంతా సజావుగానే సాగుతున్నసమయంలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రభాస్ 20వ సినిమా షూటింగ్ ఆగింది. దీన్ని పూర్తి చేసిన తర్వాతే నాగ్ అశ్విన్ సినిమాను ప్రభాస్ చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వినపడ్డాయి. నిజానికి ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ కాబట్టి అతనితో నటించడానికి దీపిక పెద్దగా అభ్యంతరం చెప్పలేదు కానీ నిర్మాతలకు పెద్ద కండీషనే పెట్టిందట. అదేంటంటే.. ప్రభాస్ 21 సినిమా హిందీ రైట్స్ తన సంస్థకు ఇవ్వమని కోరిందట. సాహో తెలుగు, తమిళంలో డిజాస్టర్ అయినా.. హిందీలో పెద్ద హిట్ అయ్యింది. ఇలాంటి తరుణంలో దీపికా పదుకొనేకు హిందీ రైట్స్ ఇవ్వడం ఎంత వరకు కరెక్టో అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. మరి దీపిక కండీషన్‌ను నిర్మాతలు ఒప్పుకుంటారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com