దీపికకు మరో అరుదైన గుర్తింపు
Send us your feedback to audioarticles@vaarta.com
మన దక్షిణాది అమ్మాయి.. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనెకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. దీని గురించి ఆమె అభిమానులు సంతోషపడుతున్నారు. అసలు దీపికా పదుకొనె దక్కించుకున్న ఆ అరుదైన గుర్తింపు ఎక్కడ? ఎందుకోసమో తెలుసా? అసలు విషయంలోకి వెళితే.. కోవిడ్ 19 ప్రభావంతో ప్రపంచమంతా లాక్డౌన్లో కొనసాగింది. చాలా రంగాలు నెమ్మదించాయి. అలా నెమ్మదించిన రంగాల్లో విమానయాన రంగం కూడా ఉంది. గ్రీకు దేశం కూడా కోవిడ్ ప్రభావంతో వారి ఏథెన్స్ విమానశ్రయాన్ని మూసి ఉంచారు. ఇప్పుడు మళ్లీ ఎయిర్ పోర్ట్‌ను రీ ఓపెన్ చేశారు.
ప్రయాణీకులను ఆక్టటుకోవడానికి అందమైన చిరునవ్వు ఉన్న సెలబ్రిటీల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఏథెన్స్ విమానశ్రయ అధికారులు భావించి ఓ లిస్టు ప్రిపేర్ చేశారు. ఈ లిస్టులో దీపికా పదుకొనె పేరు కూడా ఉంది. దీంతో అధికారులు ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఏథెన్స్ విమానశ్రయంలో ప్రతిష్టించారు. ఈ విగ్రహం కింద ప్రముఖ బాలీవుడ్ నటి అని కూడా రాయడం విశేషం. బాలీవుడ్‌తో పాటు దీపికా పదుకొనె ట్రిపుల్ ఎక్స్ అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout