దీపికకు మరో అరుదైన గుర్తింపు

  • IndiaGlitz, [Wednesday,December 09 2020]

మన దక్షిణాది అమ్మాయి.. బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొనెకి అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌రో అరుదైన గుర్తింపు ద‌క్కింది. దీని గురించి ఆమె అభిమానులు సంతోష‌ప‌డుతున్నారు. అస‌లు దీపికా ప‌దుకొనె ద‌క్కించుకున్న ఆ అరుదైన గుర్తింపు ఎక్క‌డ‌? ఎందుకోస‌మో తెలుసా? అస‌లు విష‌యంలోకి వెళితే.. కోవిడ్ 19 ప్ర‌భావంతో ప్ర‌పంచ‌మంతా లాక్డౌన్‌లో కొన‌సాగింది. చాలా రంగాలు నెమ్మ‌దించాయి. అలా నెమ్మ‌దించిన రంగాల్లో విమాన‌యాన రంగం కూడా ఉంది. గ్రీకు దేశం కూడా కోవిడ్ ప్ర‌భావంతో వారి ఏథెన్స్ విమాన‌శ్ర‌యాన్ని మూసి ఉంచారు. ఇప్పుడు మ‌ళ్లీ ఎయిర్ పోర్ట్‌ను రీ ఓపెన్ చేశారు.

ప్ర‌యాణీకుల‌ను ఆక్ట‌టుకోవ‌డానికి అంద‌మైన చిరున‌వ్వు ఉన్న సెల‌బ్రిటీల విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఏథెన్స్ విమాన‌శ్ర‌య అధికారులు భావించి ఓ లిస్టు ప్రిపేర్ చేశారు. ఈ లిస్టులో దీపికా ప‌దుకొనె పేరు కూడా ఉంది. దీంతో అధికారులు ఆమె విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి ఏథెన్స్ విమాన‌శ్ర‌యంలో ప్ర‌తిష్టించారు. ఈ విగ్ర‌హం కింద ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి అని కూడా రాయ‌డం విశేషం. బాలీవుడ్‌తో పాటు దీపికా ప‌దుకొనె ట్రిపుల్ ఎక్స్ అనే హాలీవుడ్ చిత్రంలోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

More News

పవన్ ఎంట్రీతో నిహారిక పెళ్లి వేడుకలో మరింత జోష్...

నిహారికా కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డ వివాహం బుధవారం సాయంత్రం జరగనుంది. అయితే మంగళవారం సాయంత్రం వరకూ ఒక లెక్క..

సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనకు కారణం ఇదేనట..

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనకు సంబంధించిన మిస్టరీని కొంతమేరకు అధికారులు ఛేదించారు.

'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' ట్రైలర్ విడుదల చేసిన 'జీ 5', గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్

తెలుగు వీక్షకులకు అత్యుత్తమ కంటెంట్ అందిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'. తాజాగా మరో ఇంటెన్స్ అండ్ యాక్షన్ డ్రామాను ప్రజల ముందుకు తీసుకొస్తోంది.

ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్ వెళ్లిన పవన్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేటి మధ్యాహ్నం రాజస్థాన్‌కు బయల్దేరి వెళ్లారు. మెగా డాటర్ నిహారిక వివాహం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.

అరియానా విశ్వరూపం.. టూమచ్

షో స్టార్టింగే.. రూలర్ అయిన అరియానా.. ఒక్కొక్క వస్తువును తీసుకొచ్చి వాటితో తమ అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పింది.