శ్రీదేవిగా దీపికా...?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటు దక్షిణాది... అటు ఉత్తరాదిన హీరోయిన్గా తనదైన ముద్ర వేసి, ఇటీవల అనుకోకుండా కన్నుమూసిన గొప్ప నటి శ్రీదేవి. త్వరలోనే బాలీవుడ్ నటి దీపికా పదుకొనె శ్రీదేవి పాత్రలో దర్శన మీయనుంది. వివరాల్లోకెళ్తే.. బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం `యన్.టి.ఆర్`. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్‌గా రూపొందనున్న `యన్.టి.ఆర్`లో శ్రీదేవిగా దీపికా పదుకొనె అతిథి పాత్ర చేయనుంది. స్వర్గీయ ఎన్టీఆర్, శ్రీదేవి జంటగా వెండితెరపై హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుని ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు.
ఇప్పుడు చేయబోయే ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రను అతిథి పాత్రలో చూపించబోతున్నారు. అందుకనే దీపికా పదుకొనెను ఈ సినిమాలో నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో సీఎం చంద్రబాబు నాయుడుగా డా.రాజశేఖర్, నాదెండ్ల భాస్కరరావుగా పరేశ్ రావల్ నటించనున్నారని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com