నిర్మాతగా దీపికా...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె.. త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. తల్వార్, రాజీ చిత్రాల దర్శకురాలు మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపికా పదుకొనె ఓ సినిమా చేయబోతున్నారు. మహిళా ప్రధాన చిత్రమిది.
ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితాన్ని మేఘన వెండితెరపై తీసుకొస్తుంది. పదిహేనేళ్ల వయసులోనే యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ ఏ మాత్రం కుంగిపోకుండా.. ఆత్మ విశ్వాసంతో పలువురికి స్ఫూర్తినిస్తున్నారు.
ఈ చిత్రంలో మేఘన పాత్రలో దీపికా నటించడమే కాదు సహ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారట. ఇప్పటికే ప్రియాంక, అనుష్కశర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments