'వందనం' చిత్రంతో హీరోగా దీపక్ సరోజ్
Send us your feedback to audioarticles@vaarta.com
అతడు`లో బ్రహ్మానందం వద్దకు ఓ అబ్బాయి వచ్చి నాన్నా నాకు ట్రైనేది అంటాడు..కట్ చేస్తే రీసెంట్ నటసింహ నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ హిట్ `లెజెండ్లో బాలకృష్ణ యుక్తవయసు పాత్రధారిగా మెప్పించిన యువకుడు గుర్తుండే ఉంటాడు. అతనే దీపక్ సరోజ్. అతడు`, ఆంధ్రుడు`, పెదబాబు` ఇలా ఒకటేమిటి దాదాపు నలభై చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన దీపక్ సరోజ్ రీసెంట్ అస్కార్ అవార్డ్ కు ఎంపికైన మిణుగురులు` లో లీడ్ రోల్ నటించాడు.
అలాగే `టామీ చిత్రంలో రాజేంద్రప్రసాద్ సరసన ఆయన అల్లుడు పాత్రలో కూడా మెప్పించాడు. శర్వానంద్, గౌతమ్, సాయిరాంశంకర్ వంటి హీరోల బ్యాచ్ తో పాటు ప్రముఖ సినిమా ట్రైనర్ సత్యానంద్ గారి వద్ద చిన్నప్పట్నుంచి ట్రైనింగ్ తీసుకున్న తొలి విద్యార్థి కూడా దీపక్ సరోజ్ కావడం విశేషం. అప్పటి నుండి నేటి వరకు చాలా చిత్రాల్లో డిఫరెంట్ పాత్రల్లో దీపక్ మెప్పిస్తూనే ఉన్నాడు.
తాజాగా వందనం` చిత్రంతో యువ కథానాయకుడుగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో యువకథానాయకుడుగా సైతం రాణిస్తానని దీపక్ సరోజ్ విశ్వాస్వాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com