బిచ్చగాడు మదరే మహేష్ మదర్ గా...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రం జూలై 29 నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుంది. కాగా సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు చిత్రం అతి పెద్ద కమర్షియల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని తల్లి పాత్రలో నటించిన దీపా రామానుజన్ నటన మంచి ప్రశంసలు రాబట్టుకుంది. ఈమెనే మహేష్ తల్లి పాత్రలో నటించనుంది. ఈ చిత్రంలో మహేష్ రా ఆఫీసర్‌గా నటిస్తాడని సమాచారం. ముంబై, పూణే, గుజరాత్, హైదరాబాద్ లలో ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments