నిర్భయ దోషులకు డెత్ వారెంట్...

  • IndiaGlitz, [Tuesday,January 07 2020]

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో దోషులకు ఉరిశిక్షకు విధింపుకు హైకోర్టు తీర్పు వెలువరించంది. తీహార్ జైల్లో ఉన్న దోషులకు ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని తీర్పు చెప్పింది. కాగా.. ఉరిశిక్ష ఖరారు చేసినప్పటికీ ఎనిమిదేళ్లపాటు ఇలాగే కాలం గడిసిపోయింది. అయితే ఇలా జాప్యం జరుగుతూ వస్తుండటంతో దోషులకు తక్షణమే శిక్ష అమలు చేసి తీరాల్సిందేనని నిర్భయ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. మంగళవారం నాడు ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు దోషులకు డెత్ వారెంట్ జారీచేసింది. ఇదిలా ఉంటే.. వాదనల సమయంలో తమకు న్యాయపరంగా అవకాశాలున్నాయని దోషుల తరపు న్యాయవాదులు పేర్కొనగా.. దోషులకు డెత్ వారెంట్ వెంటనే జారీచేయాలని నిర్భయ తల్లిదండ్రుల తరపు న్యాయవాది కోరారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లకు అవకాశమున్నప్పుడు కూడా డెత్ వారెంట్ ఇవ్వొచ్చని కోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

మా బిడ్డకు న్యాయం జరిగింది!

కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి ఆనందం వ్యక్తం చేశారు. ‘మా బిడ్డకు న్యాయం జరిగింది. ఆ నలుగురు దుర్మార్గులకు మరణశిక్ష అమలు చేయడం మహిళలకు మరింత ఆత్మస్థైర్యం కలిగిస్తుంది. ఈ తీర్పు ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది’ అని ఆశాదేవి చెప్పుకొచ్చారు.

More News

రజనీ ‘దర్బార్’ రిలీజ్..: ఉద్యోగులకు బంపరాఫర్!!

టైటిల్ చూడగానే కాస్త ఆశ్చర్యంగా ఉంది.. ఆశ్చర్యపోయినా సరే మీరు వింటున్నది నిజమే.! తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు..

రంగస్థలం చూపిన దారిలో సుక్కు-బన్నీ సినిమా

సినిమా అంటే సింపుల్‌గా తీసేయడము కాదు. సినిమాతో పాటు ప్రేక్షకుడు నడవాలి. ఆ సినిమాలో లీనమవ్వాలి.

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు : పవన్

రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన తెలియచేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని..

రానా, రాజ్ తరుణ్ కాంబోలో మల్టీస్టారర్

టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దగ్గుబాటి రానా, రాజ్ తరుణ్ ఓ రిమేక్ సినిమా చేయబోతున్నారట.

‘అల..’ ఫంక్షన్‌లో పవన్ ఫ్యాన్స్ గోల.. బన్నీపై ట్రోలింగ్స్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సునీల్ నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’.