Gunaranjan Shetty: అనుష్క సోదరుడి హత్యకు గ్యాంగ్‌స్టర్ స్కెచ్.. భద్రత కోసం ప్రభుత్వానికి వినతి
Send us your feedback to audioarticles@vaarta.com
పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యతో దేశంలో గ్యాంగ్స్టర్ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో బీభత్సం సృష్టించిన ఈ గ్యాంగ్స్టర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించి రక్తపుటేరులు పారిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో గ్యాంగ్స్టర్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ సినీ నటి, లేడీ సూపర్‌స్టార్ అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్ శెట్టి హత్యకు కుట్ర పన్నినట్టుగా కథనాలు రావడంతో కర్ణాటక ఉలిక్కిపడింది. అక్కడి గ్యాంగ్స్టర్ల మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఆధిపత్యం కోసం ఘర్షణలా:
వివరాల్లోకి వెళ్తే.. మంగళూరుకు చెందిన మాఫియా డాన్ ముత్తప్పరై జీవించి వున్నప్పుడు మన్విత్ రై, గుణరంజన్ శెట్టిలు ఆయనకు కుడి, ఎడమ భుజంగా ఉండేవారు. ముత్తప్ప చనిపోయిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో గుణరంజన్ శెట్టి హత్యకు మన్విత్ రై కుట్రపన్నినట్లుగా కథనాలు వస్తున్నాయి. గుణరంజన్ మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను హత్య చేసేందుకు మన్విత్ రై కుట్ర పన్నినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసిన గుణరంజన్ తనకు భద్రత కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఇకపోతే.. అనుష్కకు ఇద్దరు సోదరులు . వీరు గుణరంజన్ శెట్టి, రమేశ్ శెట్టి. వీరిద్దరూ అంటే స్వీటీకి ఎంతో ఇష్టం. షూటింగ్‌లు లేకపోతే ఆమె తన కుటుంబంతో గడిపేందుకే ఇష్టపడతారు. ఇటీవల అనుష్క తన ఫ్యామిలీతో కలిసి తీర్థయాత్రలకు కూడా వెళ్లొచ్చారు.
నవీన్ పొలిశెట్టితో అనుష్క:
ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు ఎంతో ఫిట్‌గా వుండే ఆమె ‘‘సైజ్ జీరో’’ కోసం బాగా బరువు పెరిగారు. దీంతో తిరిగి తన మామూలు రూపాన్ని తెచ్చుకోవడానికి అనుష్క తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. దీంతో సినిమా అవకాశాలు కూడా ఆమెకు తగ్గిపోయాయి. అంతేకాదు.. సినిమాలకు అనుష్కనే స్వయంగా ఓకే చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా అనుష్క ఒక చిత్రంలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com