డియర్ కామ్రేడ్ షూటింగ్ ప్రారంభం 

  • IndiaGlitz, [Monday,August 06 2018]

యంగ్ & మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా డియర్ కామ్రేడ్ రెగ్యులర్ షూటింగ్ ఇవాళ (ఆగస్ట్ 6) మొదలైంది. ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని తొండంగిలో చిత్రీకరణ ప్రారంభమైంది. యువ ప్రతిభాశాలి భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది.

ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో విజయ్ దేవరకొండ ఆంధ్రా అబ్బాయిగా కనిపించనున్నాడు. ఆంధ్రా స్లాంగ్ లో విజయ్ చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. సోషల్ రెస్పాన్సబిలిటీ ఉన్న ఇంటెన్స్ రోల్ ను విజయ్ ఈ చిత్రంలో పోషిస్తున్నాడు.

జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చనున్న ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More News

బాలీవుడ్‌లోకి 'గూఢ‌చారి'

ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసిన స్పై చిత్రం 'గూఢ‌చారి'. అడివి శేష్ హీరోగా శశికిక‌ర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందింది.

'శ్రీనివాస క‌ళ్యాణం' స‌క్సెస్‌ పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - దిల్‌రాజు

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యూత్‌స్టార్ నితిన్ హీరోగా రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా.. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న

సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండ భేరుండ'

విజయ సిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు-చల్లమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండభేరుండ'.

మ‌హేశ్ టైటిల్ అదేనా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 25వ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్‌, పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఇష్టంగా' లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వి.రుద్ర దర్శకత్వంలో  అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ "ఇష్టంగా".