కుర్ర హీరోల్లో విజయ్‌దేవరకొండ యూత్‌లో చాలా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ క్రేజీ హీరో నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. గీతగోవిందం వంటి భారీ విజయం సాధించిన సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించడంతో డియర్ కామ్రేడ్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమాను తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో విడుదల చేయనుండటం మరో విశేషం. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో చేయని సాహసాన్ని డియర్ కామ్రేడ్‌తో విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. మరి ఈయన ప్రయత్నం విజయం సాధించిందా? డియర్ కామ్రేడ్ సక్సెస్ అయ్యిందా? లేదా? విజయ్‌దేవరకొండ, రష్మిజ జంట హిట్ పెయిర్‌గా నిలిచిందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథేంటో చూద్దాం..
కథ:
వైజాగ్ కాలేజ్ స్టూడెంట్ నాయకుడు చైతన్య అలియాస్ బాబీ(విజయ్ దేవరకొండ) మార్కిస్ట్ భావాలుండే కుర్రాడు. కోపం ఎక్కువ . కాలేజ్‌లో గొడవలు పడుతుంటాడు. అపర్ణా దేవి అలియాస్ లిల్లీ హైదరాబాద్ నుండి పెళ్లి కోసం హైదరాబాద్ వస్తుంది. బాబీ ఎదురింటి వారి దగ్గరకు వస్తుంది. లిల్లీ స్టేట్ క్రికెట్ ప్లేయర్ కావడంతో ఆమె అంటే బాబీకి ఆరాధన ఏర్పడుతుంది. క్రమంగా అది ప్రేమగా మారుతుంది. లిల్లీ ముందు బాబీ ప్రేమను ఒప్పుకోదు. కానీ తర్వాత ఒప్పుకుంటుంది. బాబీ కోపం, గొడవలు పడే తత్వం చూసి లిల్లీ భయపడుతుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి. విడిపోతారు. లిల్లీని బాబీ చాలాసార్లు కలవడానికి ప్రయత్నిస్తాడు కానీ.. కుదరకపోవడంతో, పిచ్చోడిలా మారిపోతాడు. చివరకు తాతయ్య సలహాతో ఇండియాలో పలు ప్రాంతాలను సందర్శిస్తాడు. సౌండ్ థెరఫీ మీద రీసెర్చ్ చేస్తుంటాడు. మూడేళ్ల తర్వాత ఓ పని మీద హైదరాబాద్‌కు వెళతాడు. అక్కడ లిల్లీని కలుస్తాడు. కానీ మునుపటిలా కాదు.. అసలు లిల్లీకి ఏం జరుగుతుంది? లిల్లీ కోసం బాబీ ఏం చేస్తాడు? లిల్లీకి జరిగిన అన్యాయంపై బాబీ చేసే పోరాటమేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
- హీరో, హీరోయిన్ మధ్య లవ్ సన్నివేశాలు
- మెలోడి సాంగ్స్
మైనస్ పాయింట్స్:
- స్లో నెరేషన్
- బలమైన ఎమోషన్స్ లేవు.
- సాగదీత కథ
సమీక్ష:
బాబీ పాత్రలో విజయ్ దేవరకొండ ఫిట్‌గా సరిపోయాడు. కోపంతో గొడవలు పడే కాలేజ్ స్టూడెంట్ లీడర్, లవర్‌బోయ్, ప్రేయసికి జరిగిన అన్యాయంపై పోరాడే లవర్ ఇలా డిఫరెంట్ షేడ్స్‌లో విజయ్‌దేవరకొండ పాత్రను ఓన్ చేసేసుకున్నాడు. రష్మిక మందన్న ఫస్టాఫ్‌లో చక్కగా చేసింది. ఇక సెకండాఫ్‌లో ఆమె పాత్రను జస్ట్ ఓకే అనిపించింది. ఇక రష్మిక అక్కయ్య పాత్రలో చేసిన శృతి రామచంద్రన్ చక్కగా ఉంది. సుహాస్ తన పాత్ర పరిధి మేర చక్కగా కామెడీని పండించాడు. చారుహాసన్ తదితరులు వారి వారి పాత్రల పరిధుల మేర చక్కగా నటించారు.
హీరో పాత్రను దర్శకకుడు భరత్ కమ్మ చక్కగా డిజైన్ చేశాడు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్ సీన్స్‌లో కాలేజ్ స్టూడెంట్ లీడర్‌గా ఉన్న సన్నివేశాలతో పాటు అసలు తన కోపానికి, పరిస్థితులు ఎలా కారణమవుతాయనే వాటిని చక్కగా డిజైన్ చేశాడు. ఆ పోరాట తత్వాన్ని కోపంతో పోల్చి చివరలో హీరోయిన్ కోసం చేసే పోరాటాన్ని లింక్ పెడుతూ చక్కగా ఉంది. అయితే సినిమా స్లో నెరేషన్‌లో సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అనవసరంగా అనిపిస్తాయి. ఎడిటింగ్‌లో మరింత డిలీజ్ చేసుండొచ్చు అనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ ముందు సీన్ వరకు డ్రాగింగ్ సన్నివేశాలే అనిపిస్తాయి. ఓ మంచి మెసేజ్‌ను లవ్ స్టోరీ మిక్స్ చేసి చెప్పే ప్రయత్నం చేశాడు కానీ.. ఇంకా ఎమోషనల్‌గా చెప్పి ఉండాల్సిందనిపించింది. ఎంగేజింగ్ సన్నివేశాలు, ఫ్రెష్‌గా ఎక్కడా కనిపించవు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో మూడు మెలోడీలు బావున్నాయి. మిగిలిన పాటలు ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం బావుంది. సుజిత్ సారంగ్ కెమెరా పనితం బావుంది. బలమైన సంభాషణలు లేవు. ఒకట్రెండు మినహా. నిర్మాణ విలువలు బావున్నాయి.
చివరగా.. గీతగోవిందం హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయనడంలోసందేహం లేదు. అయితేఅదే అంచనాలతో వెళితే సినిమాను ఎంజాయ్ చేయలేకపోవచ్చు. మొత్తంగా స్లో నెరేషన్‌తో సాగే `డియర్ కామ్రేడ్` అభిమానులకే..
Comments