జనసేన నుంచి పోటీచేసే అభ్యర్థులకు డెడ్‌లైన్
- IndiaGlitz, [Thursday,February 21 2019]
2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసే అభ్యర్థులకు అధిష్టానం డెడ్‌లైన్ విధించింది. ఆశావహుల నుంచి వస్తున్న బయోడేటాల స్వీకరణకు తుది గడువుగా ఈ నెల 25వ తేదీని నిర్ణయించినట్లు స్క్రీనింగ్ కమిటీ ప్రకటించింది. ఇప్పటి వరకూ 1500 మంది అభ్యర్థులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు ఈ ఐదరోజుల్లో 2వేలుకు చేరుకుంటాయని స్క్రీనింగ్ కమిటీ భావిస్తోంది.
కాగా బుధవారం ఒక్కరోజే 170 మంది కమిటీ ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి ఎక్కువ శాతం మంది అభ్యర్థిత్వం కోసం వచ్చారు. కాగా.. త్వరలో పవన్ కల్యాణ్ రాయలసీమలో పర్యటించనున్న నేపథ్యంలో మరికొంత మంది టికెట్లు కావాలని ఆయన్ను సంప్రదిస్తారని సమాచారం.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ వచ్చిన ఎక్కువ అప్లికేషన్లలో మహిళలు అత్యధికులు ఉన్నట్లు తెలుస్తోంది. కమిటీ మొదలుకుని కన్వీనర్‌ల వరకు ఎక్కువ శాతం మహిళలకే ప్రాధాన్యత ఇచ్చిన పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో ఎంతమంది ఆడపడుచులకు టికెట్ల ఇచ్చి.. గెలిపించుకుని అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.