Pravalika: ప్రేమ వ్యవహారం కారణంగానే ప్రవళిక ఆత్మహత్య.. డీసీపీ క్లారిటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. శివరామ్ రాథోడ్ అనే యువకుడితో ఆమె ప్రేమలో ఉందని.. అతడితో చాట్ చేసిన చాటింగ్‌ను గుర్తించామన్నారు. ఆ చాటింగ్ పరిశీలిస్తే శివరాం మరో యువతితో పెళ్లికి సిద్ధం అయినట్లు తేలిందన్నారు. దీంతో వీరి మధ్య వాగ్వాదం జరిగి మనస్థాపంతోనే ప్రవళిక ఆత్మహత్యకు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని ఆయన వెల్లడించారు.
ఆత్మహత్యకు ముందు లవర్‌తో ఫోన్లో మాట్లాడిన యువతి..
శుక్రవారం రాత్రి ప్రవళిక హాస్టల్ గదిలో ఉరివేసుకున్నట్లు తమకు సమాచారం వచ్చిందని.. వెంటనే హాస్టల్‌కు వెళ్లామన్నారు. సీసీటీవీ ఫుటేజ్, సూసైడ్ నోట్, మృతురాలి ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని.. ఆ రిపోర్ట్ ఆధారంగా తర్వాత దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. చనిపోయే ముందు శివరాంతో ఫోన్లో మాట్లాడినట్లు తోటి రూంమేట్స్ చెప్పారన్నారు. 15 రోజుల క్రితమే హాస్టల్లో చేరిందని ఆమె ఇప్పటి వరకు ఎలాంటి పోటీ పరీక్షలు రాయలేదని స్పష్టంచేశారు. సూసైడ్ నోట్లో "అమ్మానాన్న నన్ను క్షమించండి. నా కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. ఫణి అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకో" అని రాసినట్లు డీసీపీ తెలిపారు.
ఆత్మహత్య ఘటనపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై..
కాగా హాస్టల్లో ఉరివేసుకుని ప్రవళిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. నిరుద్యోగులు సహనం కోల్పోవద్దని తమిళిసై కోరారు. ఈ ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఎస్, డీజీపీ, TSPSC కార్యదర్శిని ఆదేశించారు. అటు ఈ ఘటనపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో యువతి చనిపోతే ప్రభుత్వానికి ఏం సంబంధమని బీఆర్ఎస్ నేతలు కూడా ధీటుగా బదులిస్తు్న్నారు. మరోవైపు స్వగ్రామం బిక్కాజిపల్లిలో ప్రవళిక అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout