2డీజీ ఔషధం వినియోగానికి మార్గదర్శకాలను జారీ చేసిన డీసీజీఐ
- IndiaGlitz, [Tuesday,June 01 2021]
కరోనాకు బ్రహ్మాస్త్రంలా పనిచేసే 2డీజీ ఔషధం ఇటీవలే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. పొడి రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఔషధం.. ఒక మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్లకు అద్భుతంగా పని చేస్తుందని డీఆర్డీవో చెప్పింది. తాజాగా ఈ 2డీజీ ఔషధాన్ని ఎలా వాడాలో చెబుతూ డీసీజీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందును వాడాలని స్పష్టం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్లకు ఇస్తున్న చికిత్సకు అనుబంధంగా ఈ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
2డీజీ ఔషధం వినియోగానికి మార్గదర్శకాలు..
- కొవిడ్ పేషెంట్లకు ఇస్తున్న చికిత్సకు అనుబంధంగా 2 డీజీ ఔషధాన్ని వినియోగించాలి.
- మోస్తరు నుంచి తీవ్ర కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్లకు సాధ్యమైనంత త్వరగా అంటే గరిష్టంగా 10 రోజుల లోపు వైద్యులు ఈ మందును పేషెంట్‌కు సూచించాల్సి ఉంటుంది.
- నియంత్రణ లేని డయాబెటిస్, తీవ్రమైన గుండె జబ్బులు, ఏఆర్డీఎస్ వంటి వ్యాధులతో బాధపడే వారిపై ఈ ఔషధాన్ని ఇంకా పూర్తిగా పరీక్షించబడలేదు. అందువల్ల కాస్త ముందు జాగ్రత్త అవసరం.
- ఈ 2డీజీ ఔషధాన్ని గర్భిణులు, బాలింతలు, 18 ఏళ్ల లోపు పేషెంట్లకు ఇవ్వకూడదు.
- 2DG@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను 2డీజీ ఔషధం సప్లై చేయాలని పేషెంట్లు, వాళ్ల అటెండర్లు ఆయా హాస్పిటల్స్‌ను కోరవచ్చు.