కోవాగ్జిన్‌కు డీసీజీఐ లైసెన్సింగ్ అనుమతి..

  • IndiaGlitz, [Sunday,January 03 2021]

హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఔషధ సంస్థ భారత్ బయోటెక్‌కు ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) లైసెన్సింగ్ అనుమతిని మంజూరు చేసింది. కోవాగ్జిన్ తయారీ కోసం డీసీజీఐ ఈ అనుమతిని మంజూరు చేసింది. దీనిపై భారత్ బయోటిక్ సంస్థ ఎండీ కృష్ణ ఎల్ల హర్షం వ్యక్తం చేశారు. డీసీజీ నుంచి అనుమతి లభించడాన్ని దేశం గర్వించదగ్గ తరుణంగా కృష్ణ ఎల్ల అభివర్ణించారు. కోవాగ్జిన్‌కు అనుమతి లభించడం అనేది భారత్ శాస్త్రీయ సామర్థ్యానికి తార్కాణమని పేర్కొన్నారు. వివిధ రకాలైన వైరల్ ప్రోటీన్లను తట్టుకునేలా కోవాగ్జిన్‌ను రూపొందించినట్టు కృష్ణ ఎల్ల వెల్లడించారు.

కాగా.. ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి భారత దేశం సిద్ధమవుతున్న తరుణంలో వ్యాక్సిన్లపై ప్రచారమవుతున్న వదంతులను డీసీజీఐ (డగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) తోసిపుచ్చింది. కోవిడ్-19 వ్యాక్సిన్లను వేసుకుంటే నపుంసకత్వం వస్తుందంటూ ఇటీవలి కాలంలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ ప్రచారం అర్థరహితమని డీసీజీఐ వీజీ సోమని తెలిపారు. భద్రత పరంగా కనీసం అత్యంత సూక్ష్మమైన ఆందోళనకరమైన అంశం ఉన్నా తాము ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఆమోదం తెలపబోమని స్పష్టం చేశారు. కొవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు నూటికి 110 శాతం సురక్షితమైనవని స్పష్టం చేశారు.

డీసీజీఐ వీజీ సోమని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, భద్రత పరంగా కనీసం అత్యంత సూక్ష్మమైన ఆందోళనకరమైన అంశం ఉన్నా తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదం తెలపబోమని చెప్పారు. కొవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు నూటికి 110 శాతం సురక్షితమైనవని స్పష్టం చేశారు. ఏ వ్యాక్సిన్‌కైనా స్వల్ప జ్వరం, నొప్పి, అలర్జీ వంటి సైడ్ ఎఫెక్ట్స్ సాధారణ విషయమేనని చెప్పారు. వ్యాక్సినేషన్ వల్ల నపుంసకత్వం వస్తుందని జరుగుతున్న ప్రచారమంతా పూర్తిగా అర్థరహితమని చెప్పారు. ఈ వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమైనవని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వివరించారు.

మరోవైపు కోవిడ్ వ్యాక్సిన్లపై వదంతుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలను ఇప్పటకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. భారత దేశం కోవిడ్ రహితం కాబోతోందని, రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి మంజూరు చేసిందని, ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని ఆదివారం మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌కు అనుమతులు మంజూరైన తీరు పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలన్నింటినీ పక్కనబెట్టి కోవాగ్జిన్‌ అత్యవసర, పరిమిత వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More News

మాదకద్రవ్యాల కేసులో టాలీవుడ్ నటి అరెస్ట్..

మాదక ద్రవ్యాల కేసు.. టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసి.. తరువాత బాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టించి చివరకు తిరిగి టాలీవుడ్‌ మెడకూ చుట్టుకుని ఇటీవలి కాలంలో సైలెంట్ అయిపోయింది.

'చెక్' ఫస్ట్  గ్లింప్స్ రిలీజ్!!

నితిన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకం పై  వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం "చెక్".

జనవరిలో సందడే సందడి.. 5 సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్..

లాక్‌డౌన్ కారణంగా మూత పడిన థియేటర్లన్నీ దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.

బెల్లంకొండ‌కు ఆమె ఓకే చెబుతుందా..?

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. తెలుగులో స్టార్ హీరో ప్ర‌భాస్‌ను మాస్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసిన మూవీ ‘ఛ‌త్ర‌ప‌తి’ని

మెగాస్టార్ రెడీ.. ‘లూసిఫ‌ర్‌’కు డేట్ ఖ‌రారు..!

మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘లూసిఫ‌ర్‌’ను చిరంజీవి రీమేక్ చేయాల‌ని అనుకుంటున్న సంగ‌తి తెలిసిందే.