వ్యాక్సిన్ వచ్చేసింది.. కోవిషీల్డ్‌కు భారత్ గ్రీన్ సిగ్నల్

కరోనా రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు.. ఆరోగ్య సంక్షోభం.. ఆర్థిక వ్యవస్థకు దారుణమైన దెబ్బ.. పలువురి జీవితాలను రోడ్డు పాలు చేసింది. 2020 అంతా ఈ సంక్షోభంతోనే గడిచింది. అయితే 2021 మాత్రం గుడ్ న్యూస్‌ని మోసుకొచ్చింది. కరోనా మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది. నూతన సంవత్సరం తొలి రోజున.. తొలి కరోనా వ్యాక్సిన్‌కు భారత్‌ పచ్చజెండా ఊపింది. ఆస్ట్రాజెనెకా కంపెనీ, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ (కొవిషీల్డ్‌)కు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) షరతులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతులను మంజూరు చేసింది. దీనిని డీసీజీఐ కార్యాలయ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’కు అనుమతులిచ్చే అంశాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తున్నామని, దీనిపైనా త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని తెలిపాయి. దీంతో ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు ఆమోదం తెలిపిన మూడోదేశంగా భారత్‌ నిలిచింది. అంతకుముందు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే), అర్జెంటీనా ఈ టీకాకు అనుమతి తెలిపాయి. కాగా.. శుక్రవారం ఉదయం సమావేశమైన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో) విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు షరతులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వొచ్చంటూ డీసీజీఐకి సిఫారసు చేసింది. ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే.. డీసీజీఐ ఆమోద ముద్ర వేసి నూతన సంవత్సరం సందర్భంగా భారత ప్రజానీకానికి శుభవార్తను అందించింది.

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను ‘కొవిషీల్డ్‌’ పేరుతో పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేయనుంది. కాగా.. భారత్ నుంచి భారీగా ఆర్డర్లు రావడంతో టీకా ధరను సగానికి తగ్గించేశారు. దీంతో ఒక్కో టీకా ధరను రూ.220గా నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది రెండు డోసుల టీకా అయినందున మొత్తం వ్యాక్సిన్‌ కొనుగోలు ఖర్చు రూ.440కి మించదు. కాగా.. ఇంతకుముందే పొందిన ప్రత్యేక లైసెన్సుతో ఇప్పటికే 5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సిద్ధం చేశామని ఆ కంపెనీ సీఈఓ అదర్‌ పూనావాలా ఇటీవల ప్రకటించారు. కాగా.. ప్రస్తుతం కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. తమ టీకా కరోనా కొత్త స్ట్రెయిన్ పైనా పని చేస్తుందని ఆస్ట్రాజెనెకా కంపెనీ సీఈఓ పాస్కల్‌ సోరియట్‌ వెల్లడించారు.

More News

చిరు ‘లూసిఫర్’ నుంచి మరో అప్‌డేట్

మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

పండంటి పాపకు జన్మనిచ్చిన ‘విశ్వరూపం’ ఫేమ్

‘విశ్వరూపం’ ఫేమ్ పూజా కుమార్ గుర్తుందా? ఆమెకు తాజాగా పండంటి పాప పుట్టింది. కొంత కాలం క్రితం ఎన్ఆర్ఐ విశాల్ జోషిని పూజా కుమార్ వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ దంపతులకు పాప పుట్టింది.

నితిన్, కీర్తి సురేష్ ల 'రంగ్ దే' మార్చి 26న విడుదల

యూత్ స్టార్ 'నితిన్', 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ' సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం ఈ 'రంగ్ దే'. 'ప్రతిభగల యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి'

క్లైమాక్స్‌లో గోపీచంద్ 'సీటీమార్‌'

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’.

'క్రాక్‌' ట్రైలర్‌.. పక్కా మాస్‌

మాస్‌ మహారాజా రవితేజ సినిమా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటారో అలాంటి మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం 'క్రాక్‌'..