'బాహుబలి'గా మారిన డేవిడ్ వార్నర్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీ వరకూ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు, ప్రముఖులు, సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు తమ అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య టాలీవుడ్ సినిమా రంగంపై మోజు ప్రదర్శిస్తున్నాడు. ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమాలోని ‘బుట్టబొమ్మ..’, ‘రాములో.. రాములా’ పాటలకు డ్యాన్స్ చేయడం, ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ ‘పోకిరి’ సినిమాలో ‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’ అంటూ అప్పట్లో పండుగాడు చెప్పిన మాటలనే ఇప్పుడు బ్యాటు పట్టుకుని డేవిడ్ చెప్పాడు. ఇలా ఈ మధ్య వరుసగా టాలీవుడ్‌కు సంబంధించనవే చేస్తూ.. దక్షిణాది ప్రేక్షకులు బాగా దగ్గరవుతున్నాడు.
‘బాహుబలి’గా మారిన వార్నర్..
ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కించిన ‘బాహుబలి’ మూవీ డైలాగ్‌కు వార్నర్ లిప్ సింక్ చేశాడు. ‘అమరేంద్ర బాహుబలి అనే నేను..’ అనే డైలాగ్‌ను టిక్‌టాక్ వీడియోగా చేశాడు. ప్రస్తుతం టిక్‌టాక్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా.. డ్రెస్సింగ్ కూడా సేమ్ టూ సేమ్ అలాగే దింపేశాడు. మరోవైపు వార్నర్ కుమార్తె కూడా ఈ వీడియోలో ఉంది. మొత్తానికి చూస్తే వార్నర్ ఈ మధ్య ఎందుకే టాలీవుడ్‌పై బాగానే కన్నేసినట్లు కనిపిస్తోంది. తాజా వీడియోపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నెక్స్ట్ తమ హీరో సినిమాకు సంబంధించిన టిక్ టాక్ చేయండి సార్ అంటూ పలువురు రెక్వెస్ట్లు కూడా పెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout