ఈసారి 'రాములో రాముల..' అంటోన్న డేవిడ్ వార్నర్

  • IndiaGlitz, [Tuesday,May 12 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించింది. అలాగే ఈ సినిమాకు త‌మ‌న్ అందించిన సంగీతం మ‌రో లెవ‌ల్‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా మూడు పాట‌లు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌..., రాములో రాముల‌..., బుట్ట‌బొమ్మ లిరిక‌ల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక సినిమా విడుద‌లైన విడుద‌లైన వీడియో సాంగ్స్‌కు లిరిక‌ల్ వీడియోల‌ను మించిన రెస్పాన్స్ వ‌చ్చింది. ఒక్కొక్క వీడియోకు 100 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చింది.

ఈ సినిమాకు క్రేజ్ ఎంత‌లా పెరుగుతుందంటే బ‌న్నీ స్టెప్పుల‌ను చూసిన సెల‌బ్రిటీలంద‌రూ డాన్సులు చేస్తూ ఆ వీడియోల‌ను టిక్‌టాక్‌లో పోస్ట్ చే్స్తున్నారు. శిల్పాశెట్టి, దిశా ప‌టాని రీసెంట్‌గా బ‌న్నీ డాన్సుల‌ను అప్రిషియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇటీవ‌ల ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఈ పాట‌కు డ్యాన్స్ చేసి ఆ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. త‌న పాట‌కు డాన్స్ చేసినందుకు వార్న‌ర్‌కు బ‌న్నీ థాంక్స్ చెప్పాడు. కాగా ఇప్పుడు ఈ సినిమాలోని రాములో రాముల సాంగ్‌కు భార్యతో క‌లిసి వార్న‌ర్ స్టెప్పులేయ‌డం విశేషం. లాక్‌డౌన్ స‌మ‌యంలో డేవిడ్ వార్న‌ర్ ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రయ్యేలా టిక్‌టాక్ వీడియోల‌ను చేస్తున్నారు. బుట్ట‌బొమ్మ సాంగ్ డాన్స్ వేసిన వార్న‌ర్ దంపతులు క్ష‌త్రియపుత్రుడు సినిమాలో ఓ సాంగ్‌కు కూడా కాలు కదిపారు.అలాగే మ‌హేశ్ పోకిరి సినిమాలోని ఒక్క‌సారి క‌మిట్ అయితే నా మాట నేనే విన‌ను డైలాగ్ మీమ్‌ను వార్న‌ర్ చేశారు. ఇప్పుడు మ‌రోసారి బ‌న్నీ అల‌వైకుంఠ‌పుర‌ములోని రాములో రాముల సాంగ్‌కు భార్య‌తో క‌లిసి చిన్న స్టెప్పేశాడు.