RRR మార్ఫింగ్ పోస్టర్ పోస్ట్ చేసిన డేవిడ్ వార్నర్.. రషీద్ ఖాన్ కామెంట్!
Send us your feedback to audioarticles@vaarta.com
యావత్ దేశం ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తుండడంతో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. పైగా చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు పోరాట యోధులు అల్లూరి, కొమరం భీం పాత్రల్లో నటిస్తుండడంతో ఉత్కంఠ ఎక్కువైపోతోంది.
కరోనా వల్ల షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయినట్లు ప్రకటిస్తూ అందమైన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చరణ్, ఎన్టీఆర్ బైక్ రైడింగ్ చేస్తున్నారు. అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ నెట్ లో వైరల్ గా మారింది.
ఇక అభిమానులు రంగంలోకి దిగి ఈ పోస్టర్ కు ఎవరికి వారు ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. సినిమాలకు, క్రికెట్ కు ఇండియాలో పిచ్చ క్రేజ్. ఐపీఎల్ డేవిడ్ వార్నర్ లాంటి విదేశీ క్రికెటర్లని ఇక్కడ అభిమానులకు బాగా దగ్గర చేసింది. వార్నర్ కూడా ఇక్కడి అభిమానులతో బాగా మమేకం అయిపోయాడు. తెలుగు సినిమాల వీడియోలకు డాన్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో అలరిస్తున్నాడు.
ఇదిలా ఉండగా కొందరు సన్ రైజర్స్ అభిమానులు మంగళవారం విడుదలైన ఆర్ఆర్ఆర్ పోస్టర్ ని మార్ఫింగ్ చేసేశారు. ఎన్టీఆర్ ని కేన్ మామ విలియమ్సన్ గా, చరణ్ ని డేవిడ్ భాయ్ గా మార్చేశారు. ఈ పిక్ వార్నర్ కంట పడడంతో దానిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
మాకు ఎంత మద్దతు ఉందో ఈ పిక్ ద్వారా అర్థం అవుతోంది. ఇలాంటి స్టఫ్ పంపినందుకు థ్యాంక్స్. సోమచ్ లవ్ అంటూ వార్నర్ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ పై మరో సన్ రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. 'హెల్మెట్ పెట్టుకోండి గాయ్స్' అని కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ పై ఆర్ఆర్ఆర్ టీం కూడా లవ్ ఎమోజితో రిప్లై ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments