RRR మార్ఫింగ్ పోస్టర్ పోస్ట్ చేసిన డేవిడ్ వార్నర్.. రషీద్ ఖాన్ కామెంట్!

యావత్ దేశం ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తుండడంతో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. పైగా చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు పోరాట యోధులు అల్లూరి, కొమరం భీం పాత్రల్లో నటిస్తుండడంతో ఉత్కంఠ ఎక్కువైపోతోంది.

కరోనా వల్ల షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయినట్లు ప్రకటిస్తూ అందమైన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చరణ్, ఎన్టీఆర్ బైక్ రైడింగ్ చేస్తున్నారు. అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ నెట్ లో వైరల్ గా మారింది.

ఇక అభిమానులు రంగంలోకి దిగి ఈ పోస్టర్ కు ఎవరికి వారు ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. సినిమాలకు, క్రికెట్ కు ఇండియాలో పిచ్చ క్రేజ్. ఐపీఎల్ డేవిడ్ వార్నర్ లాంటి విదేశీ క్రికెటర్లని ఇక్కడ అభిమానులకు బాగా దగ్గర చేసింది. వార్నర్ కూడా ఇక్కడి అభిమానులతో బాగా మమేకం అయిపోయాడు. తెలుగు సినిమాల వీడియోలకు డాన్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో అలరిస్తున్నాడు.

ఇదిలా ఉండగా కొందరు సన్ రైజర్స్ అభిమానులు మంగళవారం విడుదలైన ఆర్ఆర్ఆర్ పోస్టర్ ని మార్ఫింగ్ చేసేశారు. ఎన్టీఆర్ ని కేన్ మామ విలియమ్సన్ గా, చరణ్ ని డేవిడ్ భాయ్ గా మార్చేశారు. ఈ పిక్ వార్నర్ కంట పడడంతో దానిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

మాకు ఎంత మద్దతు ఉందో ఈ పిక్ ద్వారా అర్థం అవుతోంది. ఇలాంటి స్టఫ్ పంపినందుకు థ్యాంక్స్. సోమచ్ లవ్ అంటూ వార్నర్ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ పై మరో సన్ రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. 'హెల్మెట్ పెట్టుకోండి గాయ్స్' అని కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ పై ఆర్ఆర్ఆర్ టీం కూడా లవ్ ఎమోజితో రిప్లై ఇచ్చింది.

More News

చిరంజీవి గురించి అలా ప్రచారం చేయడం దారుణం: కాంగ్రెస్ పార్టీ

2008లో మెగాస్టార్ చిరంజీవి తిరుపతి వేదికగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే.

పెళ్లి కాకుండానే గర్భం.. ప్రకటించిన హీరోయిన్!

లైవ్ ఇన్ రిలేషన్ షిప్స్ బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

నిర్మాత సి. కళ్యాణ్ పై కేసు నమోదు.. ఆ ముగ్గురితో కలసి బెదిరిస్తూ..

ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ పై కేసు నమోదైంది.

తన సొంత నిర్మాణంలో అవికా గోర్ చిత్రం.. రేపే టైటిల్ రిలీజ్

యంగ్ బ్యూటీ అవికా గోర్ తన కెరీర్ లో ఓ కొత్త అడుగు వేసింది.

కాస్త బరువు తగ్గిన నాగ్ హీరోయిన్.. సెక్సీ ఫోజులు వైరల్

ముంబయి బ్యూటీ పూనమ్ బజ్వా తెలుగులో చాలా తక్కువ చిత్రాల్లో మాత్రమే నటించింది.