పవన్ కళ్యాణ్ సినిమాకు డేట్ ఫిక్సయ్యింది...

  • IndiaGlitz, [Tuesday,March 28 2017]

జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాల త‌ర్వాత క్రేజీ కాంబినేష‌న్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం ప్రారంభం అవుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాకు ఏప్రిల్ 3న ఈ సినిమా లాంచ‌నంగా ప్రారంభం కానుంద‌ట‌. ఏప్రిల్ 6 నుండి ప‌వ‌న్ క‌ళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొంటాడ‌ట‌. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవుడు దిగి వ‌చ్చినా అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిన‌బాబు నిర్మిస్తాడు. త్వ‌ర‌లోనే ఈసినిమాకు సంబంధించిన అధికార‌క స‌మాచారం రానుంది.