ఆనందయ్య మందు పంపిణీకి డేట్ ఫిక్స్..!

  • IndiaGlitz, [Wednesday,June 02 2021]

ఆనందయ్య మందు పంపిణీ తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. వచ్చే సోమవారం అంటే ఈ నెల 7 నుంచి మందు పంపిణీ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. మందు పంపిణీపై విధి విధానాలను ఖరారు చేయడం కోసం మంగళవారం ఆనందయ్యతో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌, ఇతర శాఖల ముఖ్య అధికారులు, సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమావేశం అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. తాము చెప్పేవరకు ఆనందయ్య మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మందు తయారీకి అవసరమైన మూలికలు, ఇతర పదార్థాలు సిద్ధం చేసుకోవడానికి ఆనందయ్యకు ఐదు రోజుల సమయం పడుతుందన్నారు. బహుశా సోమవారం నుంచి మందు పంపిణీ మొదలవుతుందని వెల్లడించారు.

స్పీడ్ పోస్ట్, కొరియర్ ద్వారా...

నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు మరో శుభవార్తను సైతం వెల్లడించారు. ఇకపై ఆనందయ్య మందును కొరియర్, స్పీడ్ పోస్టు ద్వారా సైతం అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. అన్ని జిల్లాలు, ముఖ్య పట్టణాల్లోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు మందు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చక్రధర్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు కూడా అందేలా చర్యలు తీసుకొంటున్నామన్నారు. దూరప్రాంతాల వారు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే వారికి కొరియర్‌, స్పీడ్‌ పోస్టు ద్వారా మందులు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ తయారు చేస్తున్నామన్నారు. తొలుత పాజిటివ్‌ వచ్చిన వారికే మందు పంపిణీలో తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. పాజిటివ్‌ లేని వారికి ఇచ్చే పీ రకం మందును రెండో ప్రాధాన్యతగా తయారు చేసి పంపిణీ చేస్తామని కలెక్టర్‌ వివరించారు.

అన్ని జిల్లాల కలెక్టర్లకు..

ఆనందయ్య మందు పంపిణీకి ముఖ్యంగా నాలుగు పద్ధతులను ఎంచుకున్నారు. తొలుత అన్ని జిల్లాల కలెక్టర్లకు జిల్లాకు పదివేల మంది పాజిటివ్‌ బాధితులకు సరిపడా మందు పాకెట్లను పంపిణీ చేయనున్నారు. కలెక్టర్‌ నేతృత్వంలో ఆ జిల్లా పరిధిలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, హోం ఐసొలేషన్‌లో ఉన్న పాజిటివ్‌ బాధితులకు రెవెన్యూ, వలంటీర్ల ద్వారా నేరుగా మందు పాకెట్లు అందేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక రెండవది వెబ్‌ పద్ధతి.. వ్యక్తిగతంగా మందులు కావాలనుకున్నవారి కోసం వెబ్‌ సర్వీసును ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా బుక్‌ చేసుకుంటే కొరియర్‌ ద్వారా మందులు పంపిస్తారు. ఇక మూడో పద్ధతి అంటే.. కొరియర్‌ సర్వీసులు లేని గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్‌ ద్వారా పంపిణీ చేస్తారు. నాలుగో పద్ధతి కాల్‌ సెంటర్.. మందు బుకింగ్‌ కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేస్తే వారికి పోస్టు ద్వారా మందులు అందే ఏర్పాట్లు చేస్తున్నారు.

More News

యూరప్‌లో ఎవరితో ఉన్నదీ చెప్పని విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ రేర్ రికార్డ్ కొట్టాడు. ఇంగ్లీష్ డైలీ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతియేటా నిర్వహించే 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్' సర్వేలో వరుసగా మూడోసారి టైటిల్ విన్నర్‌గా నిలిచాడు.

ముఖంపై ఉమ్మేసి, కొట్టించి... రివర్స్‌లో కేసు పెట్టిన టీవీ నటి?

హిందీ సీరియల్ 'యే రిష్తా క్యా కెహతా హై' యాక్టర్ కరణ్ మెహ్రాను మండే నైట్ ముంబయ్ పోలీసులు అరెస్ట్ చేశాడు. అతడిపై వైఫ్, టీవీ నటి నిషా రావల్ కేసు పెట్టింది.

చిన్నారికి చిరంజీవి ఫిదా.. బర్త్ డే రోజున ఏం చేసిందంటే..

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. విపత్కర సమయంలో చిరు తన సొంత ఖర్చుతో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు

మన్మథుడు 2 ఫ్లాప్ కి కారణం ఆ ఒక్క సీనే : రాహుల్ రవీంద్రన్

కింగ్ నాగార్జున వెండితెరపై చేసే రొమాన్స్ చాలా అందంగా ఉంటుంది. నాగ్ స్టైల్ కి మహిళలో అభిమానులు ఎక్కువ. అందుకే నాగార్జున టాలీవుడ్ లో మన్మథుడు అయ్యారు.

బజ్: అల్లు అర్జున్ 'పుష్ప' కోసం తరుణ్ ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. బన్నీ నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిలిం ఇది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంటోంది.