దర్శకరత్న దాసరి నారాయణరావుకు అల్లు రామలింగయ్య అవార్డు ప్రదానోత్సవం!!
Thursday, March 16, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
`గత 13 సంవత్సరాలుగా స్వర్గీయ అల్లు రామలింగయ్యా గారి పేరిట కళా పీఠీం జీతాయ పురస్కారం కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. కళాకారులకు ఆయన పేరిట అవార్డులు అందించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. మనిషిగా పుట్టిన తర్వాత మన సంస్కారం తెలిజేయడానికి గీటు రాయి రెండు విషయాలు. ఒకటి మన మధ్య లేని పెద్దలను గుర్తుచేసుకోవడం.. పెద్దలను ఇలా గౌరవించుకోవడం ఎంతో గొప్ప విషయం. ఈసారి ఆ అవార్డును దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి అందిచడం సంతోషంగా ఉంది` అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
2016 సంవత్సరానికి గాను సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు సారథ్యంలో డా..అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం దర్శకతర్న దాసరి నారాయణరావుగారికి అందజేశారు. దాసరి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న నేపథ్యంలో అవార్డును చిరంజీవి చేతుల మీదుగా అల్లు అరవింద్ స్వీకరించారు.
అనంతరం చిరంజీవి ఇంకా మాట్లాడుతూ ` దాసరి గారికి- అల్లు రామలింగయ్య గారి గురించి చెప్పుకోవాలంటే గీతా ఆర్స్ట్ గురించి చె ప్పుకోవాలి. దాసరి గారు గీతా ఆర్స్ట్ లో రెండవ సినిమా డైరెక్ట్ చేశారు. అప్పుడే గీతా ఆర్స్ట్ కు పునాది పడింది. ఈరోజు ఆ సంస్థ ఇంత గొప్ప గా ఉంది అంటే కారణం దాసరి గారే. ఆయన వేసిన పునాది వల్లే . 2016 ఏడాదికి ఆయనకు అవార్డు అందజేయడం సంతోషంగా ఉంది. పౌరాణిక నాటకం చూడటం ఇదే తొలిసారి. `శ్రీనాథకవి సౌర్వభౌమ` నాటకాన్ని గుమ్మడి గోపాలకృష్ణ గారి టీమ్ నటించి మెప్పించిన తీరు నన్ను కట్టిపడేసింది. నాటకాలకు ఈరోజుల్లో ఎవరు చూస్తారనుకుంటారు. కానీ ఆడిటోరియంలో అంతా మంచి మనస్సును హత్తుకునే సన్నివేశాలు వచ్చినప్పుడు మనన్ఫూర్తిగా చప్పట్లు కొట్టడం చూస్తుంటే నాటకాలంటే ఎంత మంది ఇష్టపడుతున్నారో అర్ధమైంది. రామలింగయ్య గారికి నాటకాలంటే అమితాసక్తి. ఆయన నాటకాల నుంచే సినిమాల్లోకి వచ్చారు. ఆయన పేరిట ..నాటక రంగాన్ని ప్రోత్సహిస్తు అవార్డులివ్వడం చాలా సంతోషాన్నిస్తుంది. ఇప్పుడు అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ను ఇప్పుడు ప్రారంభించడం.దానికి నేను చైర్మన్ గా ఉండటం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ` 65 క్రితం అల్లు రామలింగయ్య గారు బట్టల పెట్టె పట్టుకుని మద్రాస్ పయనం అయ్యారు. ఆయన నటుడవ్వడం వల్ల ఇప్పుడు మూడవ తరం కొనసాగుతుంది. చాలా సంతోషంగా ఉంది. గత కొన్నేళ్ల నుంచి రామలింగయ్య గారి పేరిటి సారిపల్లి కొండలరావు గారి అధ్యక్షతన ఈ అవార్డుల ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇకపై ఆయన సౌజన్యంలో నే అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్ పై ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అల్లు రామలింగయ్య గారి 100 సంవత్సరాలు పూర్తయ్యే వరకూ వైభవంగా ఈ అకాడమీపైనే ఇస్తాం. తర్వాత నా పిల్లలు కు ఇష్టమైతే దాన్ని కొనసాగిస్తారు. అలాగే 2016 ఏడాది కిగా ను దాసరి గారిని అవార్డుతో సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. చిరంజీవిగారు, నేను స్వయంగా వెళ్లి కలిసి అవార్డు ఆయనకు అందజేస్తాం` అని అన్నారు.
తెలంగాణ రాష్ర్ట మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ` సినిమాలు చూడటం తక్కువ. ఖాళీ సమయం దొరికితే కామెడీ ఛానల్ చూస్తాను. అల్లు రామలింగయ్య గారి సీన్స్ వస్తున్నాయంటే అస్సలు మిస్ అవ్వను. ఆయన నటనంటే చాలా ఇష్టం. పాత్రలో ఒదిగిపోతారు. అంత గొప్ప వ్యక్తి అవార్డు ఫక్షన్ కు నేను రావడం సంతోషంగా ఉంది` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు, కాసు ప్రసాద్ రెడ్డి, మన్నెం గోపీ చంద్ , అల్లు అర్జున్, అల్లు శిరీష్, సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదే వేదిక పై అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్ ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments