మద్యం మత్తులో కారుతో బీభత్సం.. దాసరి కుమారుడు అరుణ్‌పై కేసు
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ సినీ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణ రావు చిన్న కుమారుడు దాసరి అరుణ్ కుమార్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఆయన్ను ర్యాష్ డ్రైవింగ్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్లో అరుణ్ కుమార్ కారును వేగంగా నడిపి రెండు బైకులను బలంగా ఢీ కొట్టారు. వాహనదారుల ఫిర్యాదు మేరకు ఆయనపై ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టారు పోలీసులు.
కేసు నమోదు చేసిన విషయంలో దాసరి అరుణ్ కుమార్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఆయనకు పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. 405 పాయింట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అరుణ్‌పై మోటార్ వెహికల్ చట్టం కింద 279, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కారు నడిపిన సమయంలో అరుణ్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. దాసరి అరుణ్ కుమార్‌పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. తండ్రి దాసరి నారాయణరావు మరణించిన అనంతరం అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. అరుణ్ తమ ఇంట్లోకి గోడ దూకి అక్రమంగా ప్రవేశించి గొడవ చేశాడని గతంలో ఆయన అన్న ప్రభు కేసు పెట్టారు. ఇప్పటికీ ఆ కుటుంబాల మధ్య గొడవలు అలాగే వున్నట్లు తెలుస్తోంది. కాగా అరుణ్‌కుమార్... సామాన్యుడు, చిన్నా, ఆది విష్ణు వంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com