దాసరి మృతిపై ఆయన కోడలు సుశీల అనుమానం...
Wednesday, May 31, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకరత్న డా.దాసరి ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలా ఉండేవారు. ఆయన మరణం తెలుగు సినీ ప్రపంచానికి తీరనిలోటే. ఎంతో మంది హీరోలు, టెక్నిషియన్స్‌కు ఇండస్ట్రీలో మంచి స్థానం కల్పించిన దాసరికి ఆయన తనయులు మాత్రం సినీ రంగంలోరాణించలేదనే వెలితి ఎప్పుడూ ఉండేది. ఇక విషయంలోకి వస్తే, దాసరి కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. దాసరికి ఇద్దరు కొడుకులు అందులో తారకప్రభు పెద్దవాడు. అతని భార్య సుశీల తారకప్రభుకు, అతని భార్య సుశీలకుఓ కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు కూడా దాసరి నారాయణరావే. అయితే . తారకప్రభు, సుశీలకు మధ్య కొన్ని గొడవలున్నాయి.
ఈ విషయంలో సుశీల దాసరిపై కేసు కూడా వేసింది. తర్వాత కేసు ఏమైందనేది ఎవరికీ తెలియలేదు. అయితే నిన్న దాసరి మరణం తర్వాత సుశీల తన కొడుకుతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. మే 4న మామగారిని కలిశానని, ఆస్థి పంపకాల్లో ఎలాంటి వాటా ఇవ్వలేదని ప్రస్తావించగా, తాను కొన్ని రోజుల్లో ఆపరేషన్ చేయించుకోబోతున్నానని, తర్వాత ఆస్థి పంపకాలు చేపడతానని అన్నారని, అలాగే తన మనవడు దాసరి నారాయణరావుని ఇండస్ట్రీకి తానే పరిచయం చేస్తానని, ఎంతో మందిని చూసుకున్న తను తన మనవడిని ఎలా వదిలేస్తానని తనతో అన్నారని సుశీల అన్నారు. అయితే రెండు రోజుల క్రితం దాసరిని కలవడానికి ఆసుపత్రికి వస్తే తనను కలవనివ్వలేదని, ఆయన మరణంపై తనకు అనుమానాలున్నాయని సుశీల ఆరోపించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
- logoutLogout
Login to post comment