బాహుబలి, కంచె చిత్రాలను ప్రశంసించిన దాసరి

  • IndiaGlitz, [Monday,March 28 2016]

63వ జాతీయ అవార్డులలో తెలుగు సినిమా తన సత్తాను చాటింది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించిన బాహుబలి' ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు సాధించగా, రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన ప్రేమకథా చిత్రం కంచె' ఉత్తమ పాంతీయ చిత్రంగా అవార్డును కైవసం చేసుకుంది.

ఈ సందర్భంగా దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ 'తొలిసారి జాతీయ అవార్డులలో జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి అవార్డు సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించేలా చేసిన చిత్రమిది. అలాగే రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు పట్టం కట్టిన సినిమా. ఇలాంటి గొప్ప చిత్రాన్ని రూపొందించిన రాజమౌళి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని , ప్రభాస్, రానా, కీరవాణి సహా యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు, అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకున్న కంచె చిత్రానికి కూడా నా అభినందనలు. ఈ కంచె చిత్రానికి సంబంధించి గతంలో ఉన్నట్టు ఎట్మాస్పియర్ ను క్రియేట్ చేయడంలో క్రిష్ సఫలీకృతుడయ్యాడు. దర్శకుడు క్రిష్, వరుణ్ తేజ్ సహా యూనిట్ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను'' అన్నారు.

More News

'ఊపిరి' చిత్రాన్ని అభినందించిన దర్శకరత్న

తెలుగు, తమిళ భాషల్లో ఈ మార్చి 25న విడుదలైన ‘ఊపిరి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

హారర్ ఎంటర్ టైనర్ 'శశికళ' ట్రైలర్ విడుదల

గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్ ఎంటర్ టైనర్ ను తెలుగులో "శశికళ" పేరుతో అనువదిస్తున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.

'స‌ర్దార్' కి కాజ‌ల్ పాజిటివ్‌ సెంటిమెంట్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో కాజ‌ల్  తొలిసారిగా  జ‌త‌క‌ట్టిన   సినిమా  'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌'. ఏప్రిల్ 8న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది ఈ సినిమా 'మ‌గ‌ధీర' త‌రువాత మ‌రోమారు యువ‌రాణి పాత్ర‌లో కాజ‌ల్ వెండితెర‌పై ద‌ర్శ‌న‌మివ్వ‌నుందీ సినిమా కోసం.

ఎన్టీఆర్ 'ఆది' కి 14 ఏళ్లు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం 'ఆది'. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ తొలిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కూడా ఇదే. ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో తార‌క్ న‌ట‌న నంద‌మూరి అభిమానులనే కాదు.

ఉగాదిని టార్గెట్ చేసిన స్టార్ హీరోలు..

తెలుగు వారి కొత్త సంవ‌త్స‌రాది ఉగాది. ఈ ప‌ర్వ‌దినాన సాధార‌ణంగా కొత్త‌ప‌నులు ప్రారంభిస్తుంటారు. ఇక మ‌న సినిమా ఇండ‌స్ట్రీలో అయితే కొత్త సినిమాలు ప్రారంభించ‌డం...ఆడియో రిలీజ్ చేయ‌డం...సినిమా రిలీజ్ చేయ‌డం చేస్తుంటారు.ఈసారి కూడా  స్టార్ హీరోలు ఉగాదిని టార్గెట్ చేస్తున్నారు. ఇంత‌కీ ఉగాది రోజున స్టార్ హీరోలు ఏం చేయ‌నున్నార‌నుకుంట&